
Hero Electric : హీరో ఎలక్ట్రిక్ తన మొత్తం ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్‌ఫోలియోలో ‘30 రోజులు.. 30 బైకులు’ పండుగ ఆఫర్ ప్రకటించింది. దీని కింద కస్టమర్లు ఇప్పుడు భారతదేశంలో బ్రాండ్ యొక్క 700+ డీలర్‌షిప్‌లలో ఉచిత హీరో ఎలక్ట్రిక్ స్కూటర్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. ప్రతిరోజూ ఒక హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేసే ఒక అదృష్ట వినియోగదారుడు తనకు కావలసిన హీరో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని ఉచితంగా ఇంటికి తీసుకువచ్చే అవకాశం పొందుతాడు.
ఈ ఆఫర్ అక్టోబర్ 7 న ప్రారంభమైంది. అన్ని హీరో ఎలక్ట్రిక్ డీలర్‌షిప్‌లలో 2021 నవంబర్ 7 వరకు ఈ ఆఫర్ చెల్లుబాటవుతుంది. హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లందరూ ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఆ తర్వాత వారు వాహనం యొక్క ఎక్స్-షోరూమ్ ధరను పూర్తిగా తిరిగి చెల్లిస్తారు.
Hero Electric ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్ సేవలను అందిస్తుంది. వినియోగదారులు ఎలక్ట్రిక్ 2W ని ఎలక్ట్రిక్ 2W వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు లేదా భారతదేశవ్యాప్తంగా 700 టచ్ పాయింట్‌లను సందర్శించవచ్చు. హీరో ఎలక్ట్రిక్ కూడా సరసమైన EMI లతో సులభమైన ఫైనాన్సింగ్ ఆప్షన్లను అందిస్తోంది. అంతేకాకుండా బ్యాటరీ, ఛార్జర్‌పై వారంటీని 5 సంవత్సరాల పొడిగించిన వారంటీ వ్యవధిని కంపెనీ అందిస్తుంది. కంపెనీ తన ఉత్పత్తులన్నింటినీ ఉచితంగా, వేగంగా హోమ్ డెలివరీని అందిస్తుంది.
ఈ విషయమై హీరో ఎలెక్ట్రిక్ సీఈవో సోహీందర్ గిల్ మాట్లాడుతూ.. గ్రీన్ మొబిలిటీ సొల్యూషన్‌లను ప్రోత్సహించడం కోసం హీరో ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ సంస్థ నియోగదారులకు ప్రత్యేకమైన పండుగ ఆఫర్‌లను ప్రకటించిందని పేర్కొన్నారు. హీరో ఎలక్ట్రిక్ ఫ్యామిలీని విస్తరించేందుకు ఇది ఒక ఉత్తేజకరమైన సమయమని తెలిపారు. 30 మంది లక్కీ కస్టమర్‌లు తమకు కావాల్సిన ఎలక్ట్రిక్ స్కూటర్ను ఉచితంగా పొందేందుకు ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.
Nice
Super