దేశవ్యాప్తంగా 7,000 పెట్రోల్ బంకుల్లో అందుబాటులోకి..
charging stations : దేశంలో ఈవీలను ప్రోత్సహించేందుకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL), ‘మహారత్న’ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ.. ముందుకొచ్చాయి. ఈ కంపెనీలు సంయుక్తంగా ఎలక్ట్రిక్ వెహికల్ (EV) ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై భారీగా పెట్టుబడులు పెట్టనున్నాయి. రాబోయే కొన్నేళ్లలో సుమారు 7,000 పెట్రోల్ పంపుల వద్ద ఛార్జింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. భారత్ పెట్రోలియం కంపెనీ దేశవ్యాప్తంగా 19,000+ రిటైల్ అవుట్‌లెట్(ఇంధన స్టేషన్‌లు)లతో భారీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది EV ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ను అభివృద్ధి చేయడం ద్వారా కంపెనీ కొత్త వ్యాపార అవకాశాన్ని ఏర్పరుచుకోనుంది.
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) భవిష్యత్తులో 19,000 పెట్రోల్ పంపుల్లో 7,000 పంపులను ఎనర్జీ స్టేషన్‌లుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రస్తుతం 44 పెట్రోల్ పంపుల్లోనే EV ఛార్జింగ్ ఫెసిలిటీని కలిగి ఉంది. వచ్చే ఐదేళ్లలో BPCL తన 1,000 MW రీచార్జి స్టేషన్లను నిర్మించడానికి రూ. 5,000 కోట్లు ఖర్చు చేయాలని కంపెనీ భావిస్తోంది.
అలాగే బయో ఫ్యూయల్స్‌లో రూ.7,000 కోట్ల పెట్టుబడి పెట్టాలని బీపీసీఎల్ యోచిస్తోంది.
పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతండడంతో కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి ఆటోమొబైల్ తయారీదారులు ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహన రంగం గణనీయమైన వృద్ధిని సాధిస్తుందని అంతా భావిస్తున్నారు. వినియోగదారులు పెట్రోల్ వాహనాల నుంచి EVలకు ఈ మార్పు చెందుతారు. ఈవీ కంపెనీలు కూడా బలమైన పంపిణీ నెట్‌వర్క్‌ను కలిగి ఉంటాయి. BPCL దేశంలో రెండవ అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీ (OMC). దీనికి దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఇంధన స్టేషన్లు, పంపిణీదారుల నెట్‌వర్క్ ఉంది. ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో బీపీసీఎల్‌కు తక్కువ వ్యవధిలోనే ఇది సాధ్యం కాగలదు.
పెట్రల్ పంపుల్లో charging stations ఏర్పాటుపై భారత్ పెట్రోలియం ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ “రాబోయే కొన్ని సంవత్సరాల్లో అభివృద్ధి చెందుతున్న EV పరిశ్రమకు మద్దతుగా 7,000 స్టేషన్లను ఏర్పాటు చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేషించుకున్నామని తెలిపారు. ఈ స్టేషన్లను ‘ఎనర్జీ స్టేషన్లు’ అని పిలుస్తారని ఆయన పేర్కొన్నారు.
మరొక ప్రభుత్వ ఇంధన రిటైలర్.. HPCL(హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్) ఇటీవల 5,000 EV ఛార్జింగ్ స్టేషన్‌లను నిర్మించే ప్రణాళికలను ప్రకటించింది.