Hero Electric, Ampere, Go Zero, Light speed మొదలైన బ్రాండ్‌లకు సంబంధించిన ఉత్పత్తులను అందించే దేశపు తొలి ఆన్‌లైన్ EV మార్కెట్ ప్లేస్‌ను BLive కంపెనీ ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ల నుండి EVలు ఇప్పుడు ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ BLive స్టోర్‌లో అందుబాటులో ఉండనున్నాయి.
BLive తన మొదటి EV ఎక్స్‌పీరియన్స్ స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించింది. తన మల్టీ-బ్రాండ్ EV స్టోర్ ప్లాట్‌ఫారమ్‌ను ఆఫ్‌లైన్‌లో తీసుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. భారతీయ బ్రాండ్లు రూపొందించిన/ తయారు చేసిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఎలక్ట్రిక్ సైకిళ్లను ప్రదర్శించడం ద్వారా తమ వినియోగదారులందరికీ ఇంటరాక్టివ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు BLive కంపెనీ తెలిపింది. ఈ స్టోర్‌లలో సాధారణ వడ్డీ లేని EMIలు, కార్డ్‌లెస్ లోన్ సదుపాయంతో సులభంగా వాహనాలను అందించాలని చూస్తున్నట్లు సంస్థ చెబుతోంది. రాబోయే మూడేళ్లలో 100 ఆఫ్‌లైన్ స్టోర్‌లను ప్రారంభించాలని చూస్తోంది. దేశంలోని ఇటువంటి స్టోర్‌లను తెరవడానికి ఇప్పటికే 200కి పైగా దరఖాస్తులు వచ్చాయి.
మొదటి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ ఆఫ్‌లైన్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి దక్షిణ భారత మార్కెట్లో పట్టు సాధించాలని BLive భావిస్తోంది. అంతేకాకుండా ఇది టైర్-2, టైర్-3 నగరాల్లో మరింతగా విస్తరించాలని భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఈ ప్రాంతాల్లో ఇటువంటి స్టోర్‌లను తెరవడానికి మరిన్ని భాగస్వాముల కోసం వెతుకుతోంది. గోవా అంతటా ఛార్జింగ్ గ్రిడ్‌ల కోసం ఏథర్ ఎనర్జీతో BLive ఇటీవల భాగస్వామ్యం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. 2020లో Hero Electric, Ampere, Go Zero, Lightspeed మొదలైన బ్రాండ్‌ల నుండి ఉత్పత్తులను అందించే భారతదేశపు మొట్టమొదటి ఆన్‌లైన్ EV మార్కెట్‌ప్లేస్‌ను కంపెనీ ప్రారంభించింది. ఈ బ్రాండ్‌ల నుంచి EVలు ఇప్పుడు BLive స్టోర్‌లో ఆన్‌లైన్/ ఆఫ్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.
తాజా పరిణామంపై BLive సహ వ్యవస్థాపకులు సమర్థ్ ఖోల్కర్ & సందీప్ ముఖర్జీ మాట్లాడుతూ.. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు, వీటిపై ప్రజల్లోకి అవగాహన కల్పించేదుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. భారతీయ EV పరిశ్రమలోని అనేక కీలక సంస్థలతో BLive వ్యూహాత్మక ఒప్పందాలు చేసుకుంటున్నట్లు తెలిపారు.
Nice