Wednesday, November 6Lend a hand to save the Planet
Shadow

అద్భుత ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike

Spread the love

200 km range, 7-year warranty..

తమిళనాడుకు చెందిన బూమ్ మోటార్స్.. స‌రికొత్త ఫీచ‌ర్ల‌తో Boom Corbett electric bike ను ఆవిష్కరించింది. ఇది ఏకంగా సింగిల్ చార్జింగ్‌పై 200కిలోమీట‌ర్ల రేంజ్‌, ఏడేళ్ల వారంటీతో రావ‌డం దీని ప్ర‌త్యేక‌త‌. కార్బెట్ ఎలక్ట్రిక్ బైక్ బుకింగ్‌లు కేవలం రూ. 499 కనీస టోకెన్ మొత్తంతో న‌వంబ‌ర్ 12 నుంచి ప్రారంభమ‌య్యాయి.

75 kmph speed

బూమ్ కంపెనీ ఈ మోడల్‌ను ‘భారతదేశంలో అత్యంత మన్నికైన, దీర్ఘకాలం ఉండే బైక్’గా ప్రచారం చేస్తోంది. ఎలక్ట్రిక్ బైక్ 2.3 kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 4.6 kWh బ్యాట‌రీ వేరియంట్ కూడా ఉంది. సింగిల్ చార్జ్‌తో 200 కిలోమీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంద‌ని కంపెనీ హామీ ఇస్తోంది. ఇందులో డిటాచ‌బుల్ బ్యాటరీలు ఉంటాయి. ఇవి పోర్టబుల్ ఛార్జర్‌తో వస్తాయి. వీటిని ఏదైనా సాధారణ 15A గృహ సాకెట్‌లో కూడా ప్లగ్ చేయవచ్చు. రెండు-బ్యాటరీ ఆప్షన్‌తో EV గరిష్టంగా 75 kmph వేగాన్ని అందుకోగలదు. సుమారు 200 కిలోల లోడింగ్ కెపాసిటీ ఉంటుంది. మన నగరాల్లో అత్యంత ఎత్తైన గ్రేడియంట్‌లను అధిరోహించగలదని కంపెనీ పేర్కొంది.

Boom Corbett electric bike
Boom Corbett electric bike

ఈ మోడ‌ల్‌లో రెండు వేరియంట్లు ఉంటాయి. ఒక‌టోది సింగిల్ బ్యాటరీతో కూడిన కార్బెట్ 14. అలాగే రెండోది డబుల్ బ్యాటరీతో కూడిన కార్బెట్ 14-EX మోడ‌ల్. కార్బెట్ 14 స్కూటర్ 100 కిలోమీటర్ల రేంజ్ ఇస్తే, కార్బెట్ 14-EX స్కూటర్స్ దాదాపు 200 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది.
కార్బెట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ ను నార్మ‌ల్ ఛార్జర్‌తో ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 గంటలు పడుతుంది. అలాగే ఫాస్ట్ ఛార్జ్‌తో కేవలం 2.5 గంటలకే ఫుల్ చార్జ్ అవుతుంది. ఈ స్కూటర్ లో 30-లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఇందులోని స్టోరేజ్ స్పేస్‌ను పెంచడానికి యాక్ససరీస్ కూడా జోడించవచ్చు.
బూమ్ మోటార్స్ తన కోయంబత్తూర్ ప్లాంట్‌లో ఏటా ల‌క్ష యూనిట్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని కంపెనీ తెలిపింది. కొత్త ప్లాంట్ కోసం స్థానాలను కూడా అన్వేషిస్తున్నట్లు పేర్కొంది.

బ్యాట‌రీపై ఐదేళ్ల వారంటీ.. ఈఎంఐ సౌక‌ర్యం..

వాహనంలో అమ‌ర్చిన బ్యాటరీ పూర్తిగా ఫైర్ ప్రూఫ్ గ‌ల‌ది. అలాగే చాలా కాలం పాటు మ‌న్నిక‌గా ఉంటుందని బూమ్ మోటార్స్ పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం బ్యాటరీపై 5 సంవత్సరాల వారంటీని, ఛాసిస్‌పై 7 సంవత్సరాల వారంటీని అందిస్తోంది. ఈ వాహనం కొనుగోలుపై 5-సంవత్సరాల EMI ప్లాన్‌ను కూడా అందిస్తోంది. దీని కారణంగా EMI రేట్లు నెలకు రూ.1,699 వరకు తగ్గుతాయి. ఇందులో ముఖ్య‌మైన ఫీచ‌ర్ల‌ను ప‌రిశీలిస్తే.. బూమ్ కార్బెట్ పెట్రోల్ సేవింగ్స్ ట్రాకింగ్, CO2 ఆఫ్‌సెట్ ట్రాకింగ్, ప్రమాదం/దొంగతనం గుర్తింపు, పేరెంట్స్ మోడ్ వంటివి ఉన్నాయి. కొత్త బూమ్ మోటార్స్ యొక్క కార్బెట్ ఎలక్ట్రిక్ బైక్ కోసం బుకింగ్‌లు న‌వంబ‌రు 12 నుంచి కనీస టోకెన్ మొత్తం కేవలం రూ. 499తో ప్రారంభమవుతాయి. ప్రారంభంలో బ్రాండ్ రూ.3,000 డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు జనవరి 2022 నుంచి ప్రారంభమవుతాయి.

Drive Type       Hub Drive
Motor Type     BLDC
Motor Power   4000 W
Range              200 km/charge
Transmission Automatic
Battery Ip Rating  67
Motor IP Rating  67

5 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *