సంవత్సరానికి 3 లక్షల యూనిట్ల ఉత్పత్తి
మూడేళ్లలో 1 మిలియన్ EV ఉత్పత్తి సామర్థ్యం
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీల్లో ఒకటైన ఒకినావా ఆటోటెక్ (Okinawa Autotech) ఇటీవల రాజస్థాన్‌లో తన రెండో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (EV ) తయారీ కర్మాగారాన్ని ప్రారంభించింది. ఈ సంస్థ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తన కొత్త తయారీ యూనిట్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. దేశంలో కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను అభివృద్ధి చేయడానికి అత్యుత్తమ యంత్రాలతో కొత్త పరిశ్రమను ఏర్పాటు చేసినట్లు ఒకినావా పేర్కొంది. ఇది ప్రస్తుతం ఈ పరిశ్రమ 3 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.
కంపెనీ చెబుతున్నదాని ప్రకారం.. ఈ పరిశ్రమలో Oki90 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌తో సహా రాబోయే కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను అభివృద్ధి చేయనున్నారు. భారతదేశంలో ఒకినావా తన పోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. దేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ తెలిపింది. ఒకినావా ఆటోటెక్ కొత్త తయారీ యూనిట్ సంవత్సరానికి 3 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయగలదు. రాబోయే 2-3 సంవత్సరాల్లో 1 మిలియన్ సామర్థ్యానికి పెంచనున్నామని కంపెనీ పేర్కొంది.
ఈవీ పరిశ్రమల అభివృద్ధికి రూ.250కోట్లు
ఒకినావా కంపెనీ కొత్త భివాడి ప్లాంట్ సామర్థ్యం.. రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉన్న ఒకినావా మొదటి ప్లాంట్ ప్రస్తుత పూర్తి సామర్థ్యం కంటే 5 రెట్లు ఎక్కువ EVలను ఉత్పత్తి చేస్తుంది. విస్తరించిన ఉత్పత్తి సామర్థ్యం ఒకినావా భారతదేశంలో పెరుగుతున్న డిమాండ్‌ను మాత్రమే కాకుండా ఇతర మార్కెట్‌లకు ఎగుమతి చేయడానికి అవకాశం ఉంది. ఒకినావా తన కొత్త పరిశ్రమల అభివృద్ధికి రూ.250 కోట్లు పెట్టుబడి పెడుతుందని, ఉత్పత్తిని పెంచడానికి మరిన్ని పెట్టుబడులు పెడుతున్నట్లు కంపెనీ తెలిపింది. .
కొత్త పరిశ్రమ ఏర్పాటుపై Okinawa Autotech (ఒకినావా ఆటోటెక్) MD, వ్యవస్థాపకుడు జీతేందర్ శర్మ మాట్లాడుతూ.. “ఈ పరిశ్రమ ఏర్పాటు, మా ఇతర కార్యక్రమాలు ‘మేడ్ ఇన్ ఇండియా, మేడ్ ఫర్ ఇండియా,’ అనే మా దృక్పథం పట్ల మా నిబద్ధతకు నిదర్శనం అని తెలిపారు. ఈవీ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, వైవిధ్యమైన, వినూత్నమైన ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోతో ఇ-మొబిలిటీకి బూస్టింగ్ ఇవ్వడంలో దోహదం చేస్తుందని తెలిపారు. భారతీయ EV పరిశ్రమలో మార్కెట్ లీడర్‌లుగా ఉండాలనే మా ప్రతిష్టాత్మక ప్రణాళికలను సాధించడంలో ఈ పరిశ్రమ అద్భుతంగా సహాయపడుతుందన్నారు.
Nice
[…] Okinawa Autotech భారీ ఈవీ ప్లాంట్ […]