Home » మార్చి 24న‌ Oki 90 electric scooter విడుద‌ల‌

మార్చి 24న‌ Oki 90 electric scooter విడుద‌ల‌

Okinawa Okhi 90
Spread the love

Oki 90 electric scooter : దేశంలో ఎలక్ట్రిక్ వాహ‌న రంగం శ‌ర‌వేగంగా దూసుకుపోతున్న త‌రుణంలో మార్కెట్‌లో అనేక కొత్త కంపెనీలు పుట్టుకొస్తున్నాయి.
ఇప్ప‌టికే ఉన్న బ‌డా ఈవీ కంపెనీలు స‌రికొత్త ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేస్తున్నాయి. తాజాగా గురుగ్రామ్‌కు చెందిన ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్‌ను తయారీ కంపెనీ ఒకినావా ఆటోటెక్.. దేశీయ మార్కెట్లో మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయబోతోంది.

మార్చి 24న

అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయ‌లేదు. కానీ మీడియాలో వ‌స్తున్న క‌థ‌నాల ప్రకారం ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను Oki 90 పేరుతో లాంచ్ చేయవచ్చని తెలుస్తోంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్చి 24, 2022న విడుద‌ల చేయ‌నున్నారు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఒకినావా నుండి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మోడ‌ల్‌ను మొద‌ట టెస్టింగ్ రైడ్ సమయంలో గుర్తించారు. దాని తర్వాత త్వరలో విడుదల చేయబోతున్నట్లు వార్తలు ఊపందుకున్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 14-అంగుళాల పెద్ద అల్లాయ్ వీల్స్ అమ‌ర్చారు. స్కూటర్లో స్టైలిష్ LED లైట్లు, ముందు మరియు వెనుక భాగంలో క్రోమ్ ప్యానెల్‌లతో డిజైన్ ఉంటుంది.
మీడియా నివేదికల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో మౌంటెడ్ యూనిట్‌కు బదులుగా, సెంట్రలైజ్డ్ మోటారు ఇవ్వవచ్చు.

అకట్టుకునే స్మార్ట్ ఫీచర్స్

ఇందులో లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, అదికూడా డిటాచ‌బుల్ బ్యాటరీని వినియోగించారు. ఇది ఫాస్ట్ ఛార్జింగ్ కు స‌పోర్ట్ చేస్తుంది. ఒకినావా నుంచి వచ్చిన ఇతర స్కూటర్‌లతో పోలిస్తే .. ఇది 150 నుండి 180 కిమీల రేంజ్‌ను అందిస్తుంద‌ని తెలుస్తోంది. దీని గరిష్ట వేగం గంటకు 70 నుండి 80 కి.మీ ఉంటుంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

Oki 90 electric scooter ఫిచర్స్ విష‌యానికొస్తే కంపెనీ యాప్ ఆధారిత మొబైల్ కనెక్టివిటీ, బ్లూటూత్, జియో ఫెన్సింగ్, నావిగేషన్, సెల్ఫ్ డయాగ్నస్టిక్స్, కీలెస్ స్టార్ట్, యాంటీ-థెఫ్ట్ అలారం, మొబైల్ ఛార్జింగ్ సాకెట్ వంటి స్మార్ట్‌ ఫీచర్లను అందించగలదు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర గురించి కంపెనీ ఎలాంటి వివ‌రాలు వెల్లడించ‌లేదు.  ఈవీ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం కంపెనీ దీనిని ప్రారంభ ధర రూ. లక్ష నుండి రూ.1.25 లక్షల (ఎక్స్-షోరూమ్)తో విడుదల చేయవచ్చు.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

ఈ Oki 90 electric scooter Ather 450, TVS iQube, Bajaj Chetak, Ola S1 వంటి స్కూటర్‌లకు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నుంది .


For Tech News in Telugu visit   techtelugu.in 

One thought on “మార్చి 24న‌ Oki 90 electric scooter విడుద‌ల‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *