Thursday, December 26Lend a hand to save the Planet
Shadow

ఈవీ మొబిలిటీ కోసం Mahindra Electric కొత్త ఒప్పందం

Spread the love

దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వినియోగాన్ని ప్రోత్స‌హించేందుకు భార‌తీయ ఆటోమెబైల్ దిగ్గ‌జం కొత్త ప్ర‌ణాళిక‌తో ముందుకు వ‌స్తోంది. మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ ( Mahindra Electric Mobility Ltd – MEML) భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ వాహనాల‌పై అవ‌గాహ‌న పెంచేందుకు, ఈవీ మొబిలిటీని పెంచేందుకు కామన్ సర్వీస్ సెంటర్స్ (CSC) అనే ప్రభుత్వ సంస్థతో క‌లిసి ప‌నిచేయ‌నుంది. ఈ సంస్థ‌లు గ్రామీణ మార్కెట్‌లోని వినియోగదారులకు మ‌హింద్రా యొక్క ఎల‌క్ట్రిక్ వాహనాలు ట్రియో, ఆల్ఫా మోడ‌ళ్ల‌ను అందిస్తుంది.

ఈవీల‌పై అవ‌గాహ‌న కోసం ..

ఈ ప్రక్రియను ప్రారంభించడానికి గానూ CSC.. గ్రామ స్థాయి పారిశ్రామికవేత్తలను (VLE -Village Level Entrepreneurs) నియమిస్తుంది. వీరు ఎల‌క్ట్రిక్ వాహ‌న అమ్మ‌కాలు , అవ‌గాహ‌న‌ను సులభతరం చేయడంలో సహాయపడతారు. వారు కస్టమర్‌లు, ఎల‌క్ట్రిక్ వాహ‌న‌ తయారీదారుల (OEM – original equipment manufacturers ) మధ్య సంబంధాన్ని ఏర్పరుస్తారు. గ్రామాల్లో ప్రభుత్వ కార్యక్రమాలపై అవగాహన కల్పించేందుకు ఈ బృందం సహకరిస్తుంది.

Mahindra Electric ప్రస్తుతం భారతదేశం అంతటా 4.7 లక్షల కంటే ఎక్కువ VLEలు ఉంంది. అలాగే CSCల సంఖ్య దాదాపు 4.5 లక్షలుగా ఉంది. ఎలక్ట్రిక్ వాహనాలు, EV ఛార్జింగ్ స్టేష‌న్ల‌ను ప్రోత్సహించడానికి CSC ద్వారా గ్రామీణ ఇ-మొబిలిటీ కార్యక్రమాన్ని గత సంవత్సరం ప్రారంభించారు.

MEML చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సుమన్ మిశ్రా మాట్లాడుతూ.. గ్రామీణ మార్కెట్లలోకి తాము విస్త‌రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రచారం చేయడానికి ఈ భాగ‌స్వామ్యం సహాయపడుతుందని తెలిపారు. తద్వారా భారతదేశం తన EV మిషన్‌ను త్వరగా సాధించడంలో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. ఎల‌క్ట్రిక్ త్రీ-వీలర్ అమ్మ‌కాల ద్వారా కంపెనీ ఆదాయం చాలా ఎక్కువగా ఉంద‌ని, సంప్రదాయ ఇంధన వాహనాలతో పోల్చినప్పుడు అత్యల్పంగా ఉంద‌ని, అయితే పర్యావరణ ప‌రిర‌క్ష‌ణ కోసం ఈవీ మొబిలిటీకి క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని పేర్కొన్నారు.

గ‌త నెల‌లోనే ఎల‌క్ట్రిక్ త్రీవీల‌ర్ విడుద‌ల‌

గత నెలలో Mahindra Electric కంపెనీ తన ఎలక్ట్రిక్ త్రీ-వీలర్ ట్రియోను మహారాష్ట్రలో 2.09 లక్షల ధరకు (ఎక్స్-షోరూమ్, ముంబై) విడుదల చేసింది. ఇది NEMO మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది IP65 వాట‌ర్‌ప్రూఫ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా శక్తిని పొందుతుంది. 8 kW శక్తిన, 42 Nm అత్యధిక టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు. ఇది వినియోగదారుకు డైరెక్ట్ డ్రైవ్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది గేర్‌లెస్, క్లచ్-లెస్, వైబ్రేషన్-ఫ్రీ గా ముందుకు క‌దులుతుంది.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *