Monday, January 20Lend a hand to save the Planet
Shadow

MINI Cooper SE ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ విడుద‌లైంది

Spread the love

ధర రూ. 47.20 లక్షల నుంచి ప్రారంభం

ఫుల్ ఛార్జ్ తో 270 కిలోమీటర్ల రేంజ్

భారతదేశంలో MINI Cooper SE త్రీ-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు రూ. 47.20 లక్షల ప్రారంభ ధర(ఎక్స్-షోరూం) తో విడుదలైంది. Cooper SE అనేది  BMW గ్రూప్ ఆధ్వర్యంలోని MINI కంపెనీకి చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ మొదటి బ్యాచ్ నవంబర్ 2021లో 2 గంటలలోపే బుక్ అయిపోయాయి. MINI మొదటి బ్యాచ్ కు సంబంధించిన డెలివరీలు, అలాగే రెండవ బ్యాచ్ కు సంబంధించిన‌ బుకింగ్‌లు 2022 మార్చిలో కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రారంభమవుతాయని అప్ప‌డే ప్రకటించింది.

READ MORE  2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

MINI Cooper SE ను ప్రపంచవ్యాప్తంగా 2019లో విడుదల చేశారు. ఇది MINI సంస్థ‌కు చెందిన త్రీ-డోర్ హ్యాచ్‌బ్యాక్ ఎలక్ట్రిఫైడ్ వెర్షన్. ఈ వాహ‌ణం పెట్రోల్ వెర్షన్ కంటే దాదాపు 145 కిలోల బరువు ఎక్కువగా ఉంటుంది.

 

ఈ త్రీ-డోర్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కొత్త ఏరో-ఆప్టిమైజ్డ్ వీల్స్‌తో పాటు హ్యాచ్‌బ్యాక్ వెలుపల, లోపలి భాగంలో కూడా నియాన్ పసుపు రంగు లైన్స్ కలిగి ఉంది. కొత్త MINI కూపర్ SE వాహ‌నంలో 32.6kWh లిథియం-అయాన్ బ్యాటరీని అమర్చారు. ఇది ఒక్కో ఛార్జీకి 270 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్‌ను అందిస్తుందని కంపెనీ పేర్కొంది. బ్యాటరీ ప్యాక్ ఎలక్ట్రిక్ మోటారుతో క‌నెక్ట్ చేయబడింది. ఇది 184 hp శక్తిని, 270 Nm గరిష్ట టార్క్‌ను జ‌న‌రేట్ చేస్తుంది.

READ MORE  2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

Mini cooper se

7.3 సెకండ్ల‌లో 100కి.మివేగం..

కూపర్ SE కేవ‌లం 7.3 సెకన్లలోనే 0-100 kmph వేగాన్ని అందుకుంటుంద‌ని MINI కంపెనీ పేర్కొంది. ఈ ఎలక్ట్రానిక్ కారు గరిష్ట వేగం 150 kmph. ఈ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌ను 11kW ఛార్జర్‌ని ఉపయోగించి 2.5 గంటల్లో 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. అలాగే. 50kW DC ఫాస్ట్ ఛార్జర్ 36 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయగలదు. కాగా ఈ ఫీచ‌ర్ల‌ను బ‌ట్టి చూస్తే కొత్త MINI కూపర్ SE ప్రస్తుతం భారతదేశంలో విక్రయించబడుతున్న అత్యంత సరసమైన లగ్జరీ ఎలక్ట్రిక్ కారుగా చెప్ప‌వ‌చ్చు.

READ MORE  2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

MINI Cooper SE లాంచ్‌పై BMW గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పవా మాట్లాడుతూ “దేశంలో MINI ఇండియా.. కాంపాక్ట్ ప్రీమియం సెగ్మెంట్‌లో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకురావడం గర్వంగా ఉందని తెలిపారు. ఇది MINI ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో బుకింగ్ కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న మొదటి సిరీస్ మోడల్ అని, ప్రీ-లాంచ్ బుకింగ్ దశలోనే పూర్తిగా విక్రయించబడింద‌ని తెలిపారు.

మరిన్ని అప్‌డేట్‌ల కోసం హ‌రిత‌మిత్ర వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు సంబంధించిన వీడియోల కోసం మా  Haritha mithra YouTube ఛానెల్‌ను స‌బ్‌స్క్రైబ్ చేసుకోండి.!

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..