Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

Okinawa Okhi 90 మార్చి 24న వ‌స్తోంది.

Spread the love

Okinawa Autotech తన కొత్త హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ Okhi 90 ని ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయడానికి స‌న్నాహాలు చేస్తోంది. ఒకినావా కంపెనీ ఇప్ప‌టివ‌ర‌కు తెచ్చిన ఈవీల్లో Okhi 90 ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్‌గా చెప్పుకోవ‌చ్చు. ఈ మోడ‌ల్‌లో అత్యాధునిక సాంకేతికత ఫీచర్లను కలిగి ఉంటుందని, ఒక్క‌సారి పూర్తి ఛార్జ్‌పై దాదాపు 200 కిమీల రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని ఈవీ రంగ నిపుణులు భావిస్తున్నారు.

Okinawa Autotech కంపెనీ కొత్త తయారీ యూనిట్‌లో ఉత్పత్తి చేయబడిన మొదటి మోడల్ Okhi 90. ఇది 3 లక్షల యూనిట్ల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది, వచ్చే 2-3 సంవత్సరాల్లో సంవత్సరానికి 1 మిలియన్ EVలకు పెంచబడుతుందని ఒకినావా చెబుతోంది. భివాడి ప్లాంట్ దాని పూర్తి సామర్థ్యాన్ని ఉపయోగించినప్పుడు, ఇది రాజస్థాన్‌లోని అల్వార్‌లో ఉన్న ఒకినావా యొక్క మొదటి ప్లాంట్ కంటే 5 రెట్లు ఎక్కువ EVలను ఉత్పత్తి చేస్తుంది.

Okhi 90 స్పెసిఫికేషన్‌లు అధికారికంగా ఇంకా వెల్లడికానప్పటికీ, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ క్లాస్-లీడింగ్ వీల్‌బేస్, ముందు, వెనుక డిస్క్ బ్రేక్‌లు ఉంటాయ‌ని తెలుస్తోంది. అలాగే అల్లాయ్ వీల్స్, పెద్ద టైర్లు, ఆల్-LED లైటింగ్ సిస్టమ్‌తో డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంటుందని భావిస్తున్నారు. ఇది ఒక ఛార్జ్‌కు 200 కిమీ రైడింగ్ రేంజ్‌ను అందించవచ్చని భావిస్తున్నారు.  Okhi electric scooter మార్చి 24, 2022న లాంచ్ చేయబడుతుంది . అదే స‌మ‌యంలో దాని ధరలను ప్ర‌క‌టించ‌నున్నారు.


For Tech News in Telugu Please Visit : Techtelugu

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *