Bounce Infinity E1 డెలివరీలు ఎప్పటినుంచంటే..
భారతదేశంలో Bounce Infinity E1 electric scooter (బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్) ఉత్పత్తి ప్రారంభమైంది. డెలివరీలు ఈనెల 18, 2022న ప్రారంభమవుతాయి. బ్యాటరీ, ఛార్జర్‌తో కలిసి ఈ Electric scooter ధర రూ.68,999 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్).
బెంగళూరు ఆధారిత బైక్ రెంటల్ స్టార్టప్.. Bounce ఇటీవల భారతదేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే.. ఈ కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ Bounce Infinity E1 ని గత ఏడాది డిసెంబర్‌లో రూ.68,999 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్ )ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఇప్పుడు అదే ఉత్పత్తి ని ప్రారంభించింది. ఈ వాహన డెలివరీలు ఏప్రిల్ 18, 2022న ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.
రాజస్థాన్‌లోని భివాడిలో..
బౌన్స్ ఇన్ఫినిటీ రాజస్థాన్‌లోని భివాడిలో ఉన్న తన అత్యాధునిక తయారీ కేంద్రం నుంచి E1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఉత్పత్తిని ప్రారంభించినట్లు ప్రకటించింది. సంస్థ యొక్క భివాడి పరిశ్రమ మూడు ఎకరాలలో విస్తరించి ఉంది. దీని వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2,00,000 యూనిట్లు గా ఉంది. ఇక్కడ స్కూటర్లతో పాటు బ్యాటరీలను రవాణా చేసే ముందు వాటి భద్రత, నాణ్యతపై తాము ప్రత్యేక దృష్టి పెట్టామని Bounce తెలిపింది.
ఈ సందర్భంగా Bounce Infinity సహ వ్యవస్థాపకుడు, CEO వివేకానంద హల్లేకెరె మాట్లాడుతూ.. “మా ప్లాంట్ నుంచి బౌన్స్ ఇన్ఫినిటీ E1 యొక్క రోల్-అవుట్‌తో తమ ఎలక్ట్రిక్ స్కూటర్‌ల మొదటి బ్యాచ్ త్వరలో అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దేశవ్యాప్తంగా కస్టమర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు.
5లక్షల యూనిట్ సామర్థ్యంతో మరో పరిశ్రమ
ఈ ఏడాది చివర్లో 5,00,000 స్కూటర్ల కంటే ఎక్కువ వార్షిక సామర్థ్యంతో దక్షిణ భారతదేశంలో మరో యూనిట్‌ను నెలకొల్పాలని యోచిస్తున్నట్లు బౌన్స్ ఇన్ఫినిటీ తెలిపింది. Bounce Infinity E1 electric scooter లో 1.5 kW సామర్థ్యం గల ఎలక్ట్రిక్ మోటారుతో పాటు డిటాచబుల్ 2 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. దీని గరిష్ట వేగం గంటకు 65 కిలోమీటర్లు ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 85 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుందని బౌన్స్ ఇన్ఫినిటీ కంపెనీ ప్రకటించింది.
యూనిక్ ఫీచర్ ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’
Bounce కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌తో ప్రత్యేకమైన ‘బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్’ అనే సరికొత్త ఆప్షన్‌ను అందిస్తోంది. దీని ప్రకారం.. బ్యాటరీ, ఛార్జర్ లేకుండానే బౌన్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం రూ.45,099 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరతో కొనుగోలు చేయవచ్చు. అలాగే రూ. 1,249/నెల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు. అదనంగా వారు బ్యాటరీ స్వాపింగ్ పాయింట్ల వద్ద బ్యాటరీని మార్చుకునే ప్రతిసారీ రూ.35 చెల్లించాల్సి ఉంటుంది. భారతదేశంలో బ్యాటరీ మార్పిడి కోసం ప్రతి నగరానికి కనీసం 300 బ్యాటరీ స్వాప్ స్టేషన్‌లను ఏర్పాటు చేయడానికి బౌన్స్ ఇన్ఫినిటీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 ప్రధాన నగరాలను లక్ష్యంగా చేసుకుంది.
For more videos please visit Harithamithra YouTube channel
👌👌👌
[…] వాహనాల తయారీ సంస్థ ‘బౌన్స్’ (BounceBounce) తన ‘ఇన్ఫినిటీ ఈ1’ ఎలక్ట్రిక్ […]