Home » Hero Electric NYX HX ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీ డిమాండ్

Hero Electric NYX HX ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీ డిమాండ్

hero electric-nyx
Spread the love

వ‌స్తువుల ర‌వాణాకు అనుకూల‌మైన Hero Electric NYX HX Electric scooters భారీగా డిమాండ్ పెరుగుతోంది. ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ‌లు త‌మ వినియోగ‌దారుల‌కు వ‌స్తువుల‌ను అంద‌జేయ‌డానికి పెట్రోల్ వాహ‌నాల‌కు బ‌దులుగా ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కే ఎక్కువ ప్రాధాన్య‌మిస్తున్నాయి.

Hero NYX

తాజాగా ప్ర‌ముఖ లాస్ట్ మైల్ డెలివరీ సంస్థ షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ (Shadowfax Technologies) దేశంలోని అతిపెద్ద ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero Electric తో భాగ‌స్వామ్యం కుదుర్చుకుంది. షాడోఫ్యాక్స్ టెక్నాలజీస్ సంస్థ ఇక‌పై త‌మ లాస్ట్-మైల్ డెలివరీల కోసం 75శాతం తన ఇ-స్కూటర్‌లను వినియోగించ‌నుంది. ఈ అసోసియేషన్‌లో భాగంగా హీరో ఎలక్ట్రిక్ షాడోఫాక్స్ కోసం తన Hero Electric NYX HX ఇ-స్కూటర్ల‌ను స‌ర‌ఫ‌రా చేయ‌నుంది.

2024 నాటికి షాడోఫాక్స్, లాస్ట్-మైల్ డెలివరీ కోసం పెట్రోల్ వాహ‌న‌ల స్థానంలో 75 శాతం EVలను వినియోగించ‌నున్న‌ట్లు ఇటీవల ప్రకటించింది. లాజిస్టిక్స్/ లాస్ట్-మైల్ డెలివరీ సెగ్మెంట్లు అపూర్వమైన వేగంతో దూసుకుపోతున్నాయి. ఈ నేప‌థ్యంలో క‌ర్బ‌న ఉద్గారాలను తగ్గించడానికి గ్రీన్ మొబిలిటీ చ‌క్క‌ని ప్ర‌త్యామ్నాయ‌మ‌ని కంపెనీ తెలిపింది.

“లాజిస్టిక్స్ మార్కెట్లో కార్బన్-ఫ్రీ మొబిలిటీని పెంచ‌డానికి అలాగే షాడోఫాక్స్ అందించే లాస్ట్-మైల్ డెలివరీ వినియోగదారుల అవసరాలను తీర్చడంలో మా భాస‌గ్వామ్యం సహాయం చేస్తుంది” అని Hero Electric మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ ముంజాల్ అన్నారు. పటిష్టమైన మౌలిక సదుపాయాలు పెరుగుతున్న దృష్ట్యా ఈ ఏడాది దేశవ్యాప్తంగా B2B ఫ్లీట్‌లలో పరిశ్రమ వృద్ధి చెందుతుందని ఆయన అన్నారు. మరిన్ని సంస్థ‌లు గ్రీన్ మొబిలిటీ వైపు మార‌డానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్స‌హ‌కాలు, రాయితీలు దోహ‌ద‌ప‌డుతున్న‌య‌ని ఆయ‌న తెలిపారు.

Shadowfax Technologies సహ వ్యవస్థాపకుడు & CEO అభిషేక్ బన్సాల్ మాట్లాడుతూ Hero Electric తో 25 శాతం విద్యుద్దీకరణ ప్ర‌క్ర‌య‌ను ప్రారంభించేందుకు సంతోషిస్తున్నామని తెలిపారు. ఈ భాగస్వామ్యం అన్ని సవాళ్లను పరిష్కరించడానికి అల‌గే పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చ‌డానికి షాడోఫాక్స్ యొక్క ప్రయత్నాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుందని బన్సాల్ చెప్పారు.

Hero Electric NYX HX Specifications

42 KM/H  Top Speed

Range  165 KM/Charge**

Full Charge  4 to 5 HRS

Motor Power  600 | 1300 Watts

Registration required?  Yes

Wheel Size  10 Inch

Battery Capacity/Rating  51.2V / 30Ah (Double Battery)

Cruise Control  No

For Tech News : Techtelugu

One thought on “Hero Electric NYX HX ఎలక్ట్రిక్ వాహ‌నాల‌కు భారీ డిమాండ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *