Ampere వాహనాలు కూడా ఉపయోగించుకోవచ్చు.
ప్రముఖ ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీదారు బౌన్స్ ఇన్ఫినిటీ (Bounce Infinity) ఇతర ఎలక్ట్రిక్ వాహన కంపెనీ కోసం కొత్తగా Bounce battery swapping stations -స్వాపింగ్ నెట్‌వర్క్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది. గ్రీవ్స్ ( Greaves )యాజమాన్యంలోని ఆంపియర్ స్కూటర్ (Ampere scooters) కోసం బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌లను అందించడానికి గ్రీవ్స్ సంస్థతో ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు బౌన్స్ ఒక ప్రకటనలో పేర్కొంది.
10 నగరాల్లో Bounce battery swapping stations
ఈ ఒప్పందంలో భాగంగా గ్రీవ్స్ రిటైల్ లాస్ట్-మైల్ కనెక్టివిటీని బలోపేతం చేయడంలో సాయం చేయనుంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఒక్కో నగరానికి 300 బ్యాటరీ మార్పిడి స్టేషన్‌లతో 10 నగరాలను లక్ష్యంగా చేసుకోవాలని కంపెనీ యోచిస్తోంది. అలాగే battery-swapping stations సేవలు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు (ఆంపియర్) తో సహా మూడు చక్రాల వాహనాలు B2B & B2C విభాగాలు) రెండింటికీ వర్తిస్తాయి. Ampere యొక్క అన్ని ప్రముఖ మోడళ్లు త్వరలో ఛార్జింగ్, బ్యాటరీ మార్పిడి కోసం బౌన్స్ స్టేషన్‌లను ఉపయోగించవచ్చు.
Bounce Infinity తన బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్ వినియోగాన్ని పెంచుకోవడానికి సమీప భవిష్యత్తులో EV తయారీదారులు ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మానుఫాక్చరర్స్ (original equipment manufacturers) (OEM)తో మరిన్ని ఒప్పందాలను కుదుర్చకోవాలని యోచిస్తోంది. బెంగళూరుకు చెందిన ఈ స్టార్టప్ ఇటీవలే తన ‘ఇన్ఫినిటీ’ లైన్ EV ద్విచక్ర వాహనాలను రూ.68,000 ధరతో విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే బౌన్స్ కస్టమర్‌లు.. కొత్త ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్యాటరీ లేకుండా కేవలం రూ.36,000 కే కోనుగోలు చేసుకునేలా కంపెనీ వెసులుబాటు కల్పించింది. ఈ వినియోగదారులు బ్యాటరీకి బదులుగా కంపెనీ బ్యాటరీ-స్వాపింగ్ నెట్‌వర్క్‌ని ఉపయోగించుకోవచ్చు. ప్రయాణంలో అవసరమైనప్పుడు బౌన్స్ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్లలో బ్యాటరీలను మార్చుకోవచ్చు ఇందుకు నామమాత్రపు ఛార్జ్ ఉంటుంది. అదే వెసులుబాటు ఇప్పుడు ఆంపియర్ ఎలక్ట్రిక్ వాహనాలకు కూడా అందుబాటులో ఉండనుంది.
బౌన్స్ సహ వ్యవస్థాపకుడు, COO అనిల్ G మాట్లాడుతూ యాంపియర్ స్కూటర్ యజమానులు ఇప్పుడు బ్యాటరీ లేకుండానే అసలు ధరలో 40-50% కంటే తక్కువకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయవచ్చని చెప్పారు. Bounce battery-swapping stations ఇంధన స్టేషన్‌కు సమానమైన సూత్రాలపై పని చేస్తాయని తెలిపారు. బౌన్స్ బ్యాటరీ చార్జింగ్/ స్వాపింగ్ స్టేషన్లు ఆంపియర్ కస్టమర్లు ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నారు. కస్టమర్‌లు కొన్ని నిమిషాల్లోనే తమ వద్ద ఖాళీగా ఉన్న బ్యాటరీలతో సులభంగా మార్చుకోవచ్చు. ఈ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో EV కస్టమర్‌లు తమ ద్విచక్ర వాహనాలు, మూడు చక్రాల వాహనాలు ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.
కిలోమీటరుకు ఒక స్టేషన్
మెట్రో నగరాల్లో ఎక్కడైనా ఒక కిలోమీటరు లోపు బ్యాటరీ మార్పిడి స్టేషన్లను ఏర్పాటు చేయాలని స్టార్టప్ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే 12-24 నెలల్లో 10 లక్షల స్కూటర్లకు సపోర్ట్ ఇచ్చేందుకు బలమైన స్వాపింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను కూడా నిర్మిస్తోందని బౌన్స్ ఇన్‌ఫినిటీ ఒక ప్రకటనలో తెలిపింది. కంపనీ నోబ్రోకర్, పార్క్+, యూనిగాస్, రెడీయాసిస్ట్, హలోవరల్డ్, గుడ్‌బాక్స్ తదితర బ్రాండ్‌లతో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది.
బౌన్స్ స్వాపింగ్ స్టేషన్ నెట్‌వర్క్ 10,00,000 పైగా మార్పిడులను పూర్తి చేసిన 200 స్టేషన్ల పంపిణీని కలిగి ఉంది. Accel India, Accel US, Sequoia Capital India, B Capital, Falcon Edge, Qualcomm, Chirate, Omidyar Network, Maverick Capital మొదలైన మార్క్యూ ఇన్వెస్టర్ల ద్వారా బౌన్స్ మద్దతు పొందింది. $220 మిలియన్లకు పైగా పెట్టుబడులను ఆకర్షించింది.
One thought on “అన్ని రకాల ఈవీల కోసం Bounce battery swapping stations”