ఎలక్ట్రిక్ స్కూటర్లకు లిక్విడ్ కూల్డ్ ఈవీ బ్యాటరీలు
అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ MatterEnergy తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం సరికొత్తగా MatterEnergy 1.0 బ్యాటరీ ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీయ వాతావరణం, ఈవీలను వినియోగించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ బ్యాటరీ ప్యాక్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.
భవిష్యత్ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాటరీ ప్యాక్‌ని అభివృద్ధి చేశామని MatterEnergy వ్యవస్థాపకుడు, CEO మోహల్ లాల్‌భాయ్ తెలిపారు. మ్యాటరెనర్జీ 1.0 బ్యాటరీ ప్యాక్ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IITMS) వంటి ప్రత్యేక లక్షణాలతో వస్తుంది. IITMS యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది భారతదేశంలో ఈ సాంకేతికతతో వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్యాటరీ ప్యాక్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు.
బ్యాటరీ ప్యాక్ యొక్క భద్రత, బ్యాటరీ లైఫ్, పనితీరుకు ప్రాధాన్యతనిచ్చినట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా బ్యాటరీ కేసింగ్ తేలికైన మెటల్‌తో నిర్మించబడిందని,. ఇది ఇతర పదార్థాలతో పోల్చినప్పుడు ఉష్ణ వాహకమని తెలిపారు. MatterEnergy 1.0 బ్యాటరీ అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంటుంది, అలాగే IP67 వాటర్‌ప్రూఫ్ రేట్ కూడా ఉంది. దీని సూపర్ స్మార్ట్ BMS సరైన సిస్టమ్ సామర్థ్యం, భద్రత, విశ్వసనీయతను అందిస్తుందని తెలిపారు.
మాటర్ ఎనర్జీ కంపెనీ ఇటీవలే తన MatterDrive 1.0 ఎలక్ట్రిక్ మోటార్‌ను కూడా IITMSతో విడుల చేసింది. CY 2022 మూడవ త్రైమాసికంలో కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు మోహల్ లాల్‌భాయ్ వెల్లడించారు.
[…] వాహనాలను తీసుకురావాలని మ్యాటర్ (Matter) భిన్నమైన విధానాన్నితీసుకుంది. […]