MatterEnergy సరికొత్త ఆవిష్కరణ
ఎలక్ట్రిక్ స్కూటర్లకు లిక్విడ్ కూల్డ్ ఈవీ బ్యాటరీలు
అహ్మదాబాద్ కు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ స్టార్ట్-అప్ MatterEnergy తన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం సరికొత్తగా MatterEnergy 1.0 బ్యాటరీ ప్యాక్‌ను ఆవిష్కరించింది. భారతీయ వాతావరణం, ఈవీలను వినియోగించే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తమ బ్యాటరీ ప్యాక్‌ను అభివృద్ధి చేసినట్లు కంపెనీ తెలిపింది.భవిష్యత్ మొబిలిటీని దృష్టిలో ఉంచుకుని ఈ బ్యాటరీ ప్యాక్‌ని అభివృద్ధి చేశామని MatterEnergy వ్యవస్థాపకుడు, CEO మోహల్ లాల్‌భాయ్ తెలిపారు. మ్యాటరెనర్జీ 1.0 బ్యాటరీ ప్యాక్ స్మార్ట్ బ్యాటరీ మేనేజ్‌మెంట్ సిస్టమ్, ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెంట్ థర్మల్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IITMS) వంటి ప్రత్యేక లక్షణాలతో వస్తుంది. IITMS యాక్టివ్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది భారతదేశంలో ఈ సాంకేతికతతో వచ్చిన మొదటి ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్యాటరీ ప్యాక్‌గా నిలిచ...