ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌

Spread the love

HOP Electric Mobility ఘ‌న‌త‌

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక్ వాహ‌న త‌యారీ సంస్థ HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ఏడాది వ్యవధిలో దేశవ్యాప్తంగా 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ 2022 చివరి నాటికి 300 కంటే ఎక్కువ రిటైల్ అవుట్‌లెట్‌లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఈ సందర్భంగా HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ వ్యవస్థాపకుడు & CEO కేతన్ మెహతా మాట్లాడుతూ.. HOP Electric మ‌రోసారి మళ్లీ తన సత్తాను నిరూపించుకుంది. ప్ర‌స్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ప్రయోజనాల గురించి వినియోగదారులు తెలుసుకుంటున్నారు. పర్యావరణ అనుకూల రవాణా వ్య‌వ‌స్థ‌కు మార‌డానికి ఇది చ‌క్క‌ని అవ‌కాశ‌మ‌ని తెలిపారు.

READ MORE  EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్‌ ‌వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు

HOP Electric Mobility (హాప్ ఎలక్ట్రిక్ మొబిలిటీ) ప్రస్తుతం దాని పోర్ట్‌ఫోలియోలో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను కలిగి ఉంది. అవి HOP LEO, HOP LYF. ఈ రెండు Electric Scooters (ఎల‌క్ట్రిక్ స్కూటర్‌లు) బేసిక్, స్టాండర్డ్, ఎక్స్‌టెండెడ్ అనే మూడు వేరియంట్ల‌లో అందుబాటులో ఉన్నాయి.

రెండు మోడ‌ల్స్‌, మూడు వేరియంట్స్‌..

HOP LYF అనేది ఎంట్రీ/ మిడ్-లెవల్ వెరియంట్‌. ఇవి రెండూ 80 కి.మీ పరిధిని అందిస్తాయి. అయితే టాప్-ఎండ్ వెర్షన్ 125 కి.మీ రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. మరోవైపు, HOP LEO యొక్క రెండు ట్రిమ్‌లు 75 కి.మీ పరిధిని అందిస్తాయి. అయితే దీని టాప్ వేరియంట్ పరిధి 120 కి.మీ రేంజ్ ఇస్తుంది. HOP ఎలక్ట్రిక్ వాహనాలు LED కన్సోల్, డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు, USB ఛార్జర్, స్వాప్ చేయగల స్మార్ట్ బ్యాటరీ, GPS, యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, రిమోట్-కీ వంటి ఫీచర్లతో వస్తాయి.

READ MORE  Simple OneS | ఓలాకు పోటీగా కొత్తగా సింపుల్ వన్ ఎస్..

త్వ‌ర‌లో HOP OXO 100 ఈ బైక్ విడుద‌ల

హాప్ కంపెనీ త్వరలో HOP OXO 100 పేరుతో హై-స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను విడుదల చేయనుంది. HOP ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రకారం, OXO 100 యొక్క టాప్ స్పీడ్ 100 kmph, 150 km రేంజ్ కలిగి ఉంటుంది. సంస్థ కొత్త ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను వివిధ ప్రాంతాలలో పరీక్షించింది. హాప్ ఎలక్ట్రిక్ కూడా హై-స్పీడ్ స్కూటర్‌ను కూడా విడుద‌ల చేసేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్‌తో 120 కి.మీ వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది.

READ MORE  Simple OneS | ఓలాకు పోటీగా కొత్తగా సింపుల్ వన్ ఎస్..

HOP Electric Scooter లపై కేతన్ మెహతా మాట్లాడుతూ.. ”HOP ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు న్యూ జ‌న‌రేష‌న్ రైడర్‌లకు సరైన తోడుగా మారుతున్నాయని తెలిపారు. ఎవరైనా ఈ స్కూటర్లను సులభంగా న‌డిపించ‌వ‌చ్చ‌ని అన్నారు. ఈ స్కూటర్లు రైడర్, పిలియన్ సీట్లు రెండింటినీ సౌకర్యవంతంగా ఉండేలా రూపొందించబడ్డాయని, ఎక్కువ దూరాలకు అనుకూలంగా ఉంటాయ‌ని పేర్కొన్నారు. ఇప్పుడు హై-ఎండ్ ఫీచర్లతో రెండు కొత్త ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను లాంచ్ చేస్తున్నామ‌ని తెలిపారు. ఇవి వినియోగదారులకు చ‌క్క‌ని రైడింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ ఇస్తాయ‌ని తెలిపారు.

One Reply to “ఏడాదిలోనే 100 ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్స్‌”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *