జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ ఇండియా ( Mercedes Benz ) వచ్చే నాలుగేళ్లలో (2027 నాటికి) ఇండియా విక్రయాలు 25% ఎలక్ట్రిక్ కార్ల నుండి రావాలని కోరుకుంటోంది. ఇందుకోసం మరో 8-12 నెలల్లో నాలుగు సరికొత్త EV మోడళ్లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది.
“2027 నాటికి భారతదేశంలో 25% అమ్మకాలు EVల నుండి రావడం లక్ష్యమని Mercedes-Benz కార్స్ రీజియన్ ఓవర్సీస్ హెడ్ మాథియాస్ లూర్స్ ఓ వార్తా చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి, తమకు కొత్త మోడల్స్ అవసరమని, వాటిలో నాలుగు మోడళ్లను 8-12 నెలల్లో ప్రారంభిస్తామని తెలిపారు.
కళ్లు చెదిరే ధరలు
Mercedes Benz ఇండియా లగ్జరీ EV రంగంలో అగ్రగామిగా ఉంది. ఇది అక్టోబర్ 2020లో EQCని ప్రారంభించింది, ఆ తర్వాత ఆగస్టు 2022లో EQS AMG, సెప్టెంబర్ 2022లో EQS, అలాగే డిసెంబర్ 2022లో EQB ఈవీని ప్రవేశపెట్టింది. వీటిలో, EQS (ధర 1.55 కోట్లు, ఎక్స్‌షోరూమ్), భారతదేశంలో అసెంబుల్ చేయబడింది. మిగతావన్నీ CBU (పూర్తిగా నిర్మించబడిన యూనిట్) దిగుమతులు. EQB దాని అత్యంత సరసమైన EV (74.5 లక్షలు), అయితే EQS AMG అత్యంత ఖరీదైనది దీనని ఎక్స్‌షోరూం ధర రూ. 2.45 కోట్లు.
ప్రపంచవ్యాప్తంగా Mercedes-Benz ఏడు EV మోడల్లను కలిగి ఉంది. అవి EQE, EQE SUV, EQS, EQS SUV, EQC, EQA , EQB, మరిన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి.
ఇండియాలో అగ్రగామిగా మెర్సిడెస్-బెంజ్ ఇండియా
CY22లో, మెర్సిడెస్-బెంజ్ ఇండియా 15,822 యూనిట్లను విక్రయించి దేశంలోనే అతిపెద్ద లగ్జరీ కార్ ప్లేయర్‌గా ఉంది. ఆ తర్వాత BMW ఇండియా (11,268 యూనిట్లు), ఆడి ఇండియా (4,187 యూనిట్లు) ఉన్నాయి. వోల్వో, జాగ్వార్ ల్యాండ్ రోవర్, లెక్సస్ కలిసి దాదాపు 7,000 యూనిట్లను విక్రయించాయి. పరిశ్రమ అంచనాల ప్రకారం.. 2022లో భారతదేశంలో దాదాపు 38,000 లగ్జరీ కార్లు విక్రయించబడ్డాయి.