Sunday, December 8Lend a hand to save the Planet
Shadow

Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్

Spread the love

భారతదేశంలో Decathlon Rockrider E-ST100 ప్రీమియం ఎలక్ట్రిక్ సైకిల్ ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 తో విడుదలైంది. ఇది గరిష్టంగా గంట‌కు 25 kmph వేగంతో ప్రయాణిస్తుంది. అలాగే 42 Nm గరిష్ట టార్క్‌ని జ‌న‌రేట్ చేస్తుంది. భారతదేశంలోని ప్రముఖ క్రీడా వస్తువుల బ్రాండ్‌లలో ఒకటైన డెకాథ్లాన్ ఈ రాక్‌రైడర్ E-ST100 సైకిల్‌ను విడుదల చేయడంతో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశించిన‌ట్లైంది. కాగా మొదటి దశలో కంపెనీ బెంగళూరులోని వైట్‌ఫీల్డ్  బన్నెరఘట్ట రోడ్‌లోని మూడు స్టోర్లలో ఈ-సైకిళ్ల  150 యూనిట్లను పరిచయం చేసింది. కొత్త Decathlon Rockrider E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశంలో దీని ఎక్స్‌షోరూం ధ‌ర రూ.84,999 గా నిర్ణ‌యించారు.

Decathlon Rockrider E-ST100 electric cycle

స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. Rockrider E-ST100 42 Nm గరిష్ట టార్క్‌ను అభివృద్ధి చేసే 250W వెనుక హబ్ మోటార్‌తో అమర్చబడి ఉంది. ఇది గంట‌కు 25 kmph స్పీడ్ తో ప్ర‌యాణిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ వేరు చేయగలిగిన (డిటాచ‌బుల్‌) 380 Wh శామ్‌సంగ్ లిథియం-అయాన్ సెల్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇది ఆరు గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. ఫ్లాట్ టెర్రైన్‌లో మోడ్ 1లో ఒకే ఛార్జ్‌పై 100 కిమీ వరకు పెడల్ సహాయాన్ని అందిస్తుంది.

E-ST100 గరిష్ట శక్తి, గరిష్ట కట్-ఆఫ్ వేగం కోసం ARAI ధృవీకరించబడిందని డెకాథ్లాన్ పేర్కొంది. అంతేకాకుండా, దాని బ్యాటరీ భద్రత, నాణ్యతను నిర్ధారించడానికి BIS సర్టిఫికేట్ పొందింది. ఈ ఇ-సైకిల్ విభిన్న హైట్ ఉన్న వాహ‌న‌దారుల‌కు సరిపోయేలా మీడియం, లార్జ్ అనే రెండు ఫ్రేమ్ సైజులలో అందుబాటులో ఉంది. Decathlon యొక్క కొత్త Rockrider E-ST100 మూడు రకాల పెడల్ సహాయాన్ని కలిగి ఉంది. అవి ఎకో, స్టాండర్డ్, బూస్ట్. కంపెనీ ఫ్రేమ్‌పై జీవితకాల వారంటీని, అలాగే బ్యాటరీ ప్యాక్‌పై 2 సంవత్సరాలు లేదా 500 ఛార్జింగ్ సైకిల్స్ వారంటీని అందిస్తోంది.

కంపెనీ ఏం చెబుతోంది?

డెకాథ్లాన్ రాక్‌రైడర్ E-ST100 ఎలక్ట్రిక్ సైకిల్ లంచ్  గురించి  డెకాథ్లాన్ స్పోర్ట్స్ ఇండియా ఇ-సైకిల్ ప్రాజెక్ట్ లీడర్ ఎబిన్ మాథ్యూ మాట్లాడుతూ, “మేము అత్యంత చురుకైన సైక్లింగ్‌కు నిలయమైన బెంగళూరు నగరంలో మొదటగా ‘రాక్‌రైడర్ E-ST100’ ఎలక్ట్రిక్ సైకిల్‌ను ప్రారంభిస్తున్నాము.  డెకాథ్లాన్‌లో  స్థిరమైన రవాణాను ప్రోత్సహించడానికి, చురుకైన జీవనశైలిని ప్రోత్సహించడానికి మేము కట్టుబడి ఉన్నాము అని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *