సింపుల్ వన్ (Simple One) వాహనాన్ని విడుదల చేసింది. మే 23న అధికారికంగా ప్రారంభించనుంది. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల్లో అత్యధిక రేంజ్ ఇచ్చే వాహనం సింపుల్ వనే కావడం విశేషం. ఈ స్కూటర్ ను గతంలోనే బుకింగ్ చేసుకొని ఎదురుచూస్తున్న వినియోగదారులకు.. స్కూటర్లను డెలివరీలను ప్రారంభించడానికి కంపెనీ సిద్ధమవుతోంది.
సింగిల్ చార్జిపై 236కి.మి రేంజ్
సింపుల్ వన్ Simple One Electric Scooter లో బ్యాటరీ ప్యాక్ స్కూటర్‌కు అధిక వేగం, మెరుగైన డిజైన్, పవర్ ఫుల్ బ్యాటరీ సిస్టమ్‌లు, పవర్ట్రెయిన్లను కలిగి ఉంది. సింపుల్ వన్ లో 4.8kWh బ్యాటరీ ప్యాక్ ను పొందుపరిచారు. ఇది పూర్తి ఛార్జింగ్‌పై 236km రేంజ్ ను అందిస్తుంది. అయితే ఈ స్కూటర్ 2.7 సెకన్లలో 0 నుండి 40kmph వేగాన్ని అందుకుంటుంది.
Simple One Electric Scooter లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు, డిస్క్ బ్రేక్‌లు, పెద్ద TFT డిస్ప్లే, మొబైల్ ఫోన్ కనెక్టివిటీ తోపాటు మరెన్నో ఫీచర్లను కలిగి ది సింపుల్ వన్ ఇదిలా ఉండగా సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ పలు రంగులలో అందుబాటులో ఉంది. ఈ సింపుల్ వన్.. ప్రస్తుత మార్కెట్లో దూసుకుపోతున్న ఏథర్ 450 (Ather 450), ఓలా S1 (Ola S1), బజాజ్ చేతక్, టీవీఎస్ ఐక్యూబ్ (TVS IQube) వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోటీపడుతుంది.