
New Chetak Electric Scooter : ఈవీ అభిమానులకు గుడ్ న్యూస్.. తక్కువ ధరలో కొత్త బజాజ్ చేతక్ వస్తోంది?
New Chetak Electric Scooter | ప్రముఖ ద్విచక్రవాహన సంస్థ బజాజ్ ఆటో 2020లో ఎలక్ట్రిక్ చేతక్‌ను లాంచ్ చేసి ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లోకి ప్రవేశించింది. ప్రారంభంలో ఈ చేతక్ ఈవీని ఎవరూ అంతగా పట్టించుకోలేదు. కానీ 2023 నుంచి క్రమంగా ప్రజాదరణ పొందింది ఇప్పుడు ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో బజాజ్ రెండవ స్థానంలో నిలిచింది. చేతక్‌కి సంబంధించిన మరో కొత్త మోడల్ ను డిసెంబర్ 20న విడుదల చేయనున్నట్లు కంపెనీ తాజాగా ప్రకటించింది.రోజువారీ రవాణా అవసరాల కోసం స్కూటర్ ప్రాక్టికాలిటీని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. Ather Rizta, Ola S1, మరియు TVS iQube వంటి పోటీ మోడల్‌లు పెద్ద స్టోరేజ్ స్పేస్‌లను కలిగి ఉండి ఫ్యామిలీ స్కూటర్ గా మార్కెట్‌లో క్రేజ్ ను సంపాదించుకున్నాయి. దీంతో బజాజ్ కూడా తన లోపాన్ని సవరిస్తూ చేతక్ లోని నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని భావిస్తోంది. ఈక్రమంలోనే ఎక్కువ బూట...