Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

యూకలిప్టస్: దగ్గు జలుబును నయం చేసే దివ్యౌషధం

Spread the love

వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు, శీతల గాలుల కారణంగా జలుబు, ఫ్లూ వైరస్‌లు సోకడానికి అవకాశాలెక్కువ. అయితే ఫ్లూని ఎదుర్కోవటానికి ప్రకృతి ప్రసాదించిన ఔషధాలు మనకు అందుబాటులో ఎన్నో ఉన్నాయి. అందులో యూకలిప్టస్ ప్రధానమైనది.

యూకలిప్టస్ వేగంగా పెరిగే సతత హరిత వృక్షం. దీని శాస్త్రీయనామం.. యూకలిప్టస్ గ్లోబులస్. అలాగే దీనిని ఏకలిప్త, సుగంధ పత్ర, బ్లూ గమ్, యూకలిప్టస్, యూకేలిప్టస్, యుక్కాలిమారం, నీలగిరి, జీవకము, తైలపర్ణ, నీలనిర్యాస అనే పేర్లతోనూ పిలుస్తారు..

భారతీయ ఆయుర్వేదంతోపాటు చైనీస్, ఇతర యూరోపియన్ ఔషధాల్లో యూకలిప్టస్ నూనెను అనేక రకాల రుగ్మతలకు చికిత్స చేయడానికి వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. యూకలిప్టస్ వర్షాకాలంలో వచ్చే జలుబు, దగ్గు వంటివాటికి యూకలిప్టస్ మీకు ఎంతో సహాయకారిగా ఉంటుంది.

యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్:

యూకలిప్టస్ లో 400 విభిన్న జాతులు ఉన్నాయి..అందులో యూకలిప్టస్ గ్లోబులస్ జాతి మొక్క నుంచి విస్తృతంగా ఉపయోగించే యూకలిప్టస్ నూనెను తీస్తారు. ఆకులను వేడిచేసి ఆవిరి ద్వారా యూకలిప్టస్ నూనెను సేకరిస్తారు. ఈ నూనె రంగులేనిది, ఘాఢమైన సువాసనతో ఉంటుంది 1, 8-సినియోల్‌తో కూడిన అనేక సమ్మేళనాల మిశ్రమంతో ఉంటుంది. దీనిని యూకలిప్టాల్ అని కూడా పిలుస్తారు యూకలిప్టస్ ఆయిల్ అనేది శ్వాసకోశ సమస్యల నుండి ఉపశమనం పొందేందుకు అద్భుతమైన ఎంపిక. వర్షాకాలంలో, యూకలిప్టస్ ఆయిల్ తో ఉండటం జలుబు, దగ్గు నుండి ఉపశమనం లభిస్తుంది.

యూకలిప్టస్ ఆయిల్ కలిగిన బామ్స్/రబ్స్:

సాధారణంగా మెంథాల్, కర్పూరం, యూకలిప్టస్ ఆయిల్ వంటి మూలికా పదార్ధాల మిశ్రమంతో బామ్స్(జెల్లీ) తయారు చేస్తారు. దగ్గు, జలుబు లక్షణాల నుండి ఉపశమనం పొందేందుకు యూకలిప్టస్ ఆయిల్ ఉన్న జెల్లీ రబ్స్ యొక్క సమయోచిత అప్లికేషన్ సహాయపడుతుంది. యూకలిప్టస్ ఆయిల్ ఒక ఎక్స్‌పెక్టరెంట్.. కఫం తొలగింపులో సహాయపడుతుంది. యూకలిప్టస్ ఆయిల్ రుబేసియెంట్ గా పనిచేసి జలుబు కారణంగా వచ్చే శరీర నొప్పుల నుండి ఉపశమనం పొందేందుకు వెచ్చదనాన్ని కలిగిస్తుంది.

యూకలిప్టస్ టీ:
యూకలిప్టస్ అనేక ఔషధ గుణాలను కలిగి ఉంది. ఇది ఇన్ఫెక్షన్ , ఫ్లూకి విరుగుడుగా పనిచేస్తుంది. యూకలిప్టస్ ఆకులు శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. వేడి నీటిలో ఒక కప్పు టీని సిద్ధం చేయండి. దానికి కొన్ని తాజా లేదా ఎండిన యూకలిప్టస్ ఆకులను జోడించండి. వడకట్టండి.. టీ యొక్క మంచితనాన్ని ఆస్వాదించండి.

యూకలిప్టస్ ఆవిరి పీల్చడం:
ఆవిరి పీల్చడం అనేది జలుబు మరియు ఫ్లూని నిర్వహించడానికి వర్షాకాలంలో చేయగలిగే ముఖ్యమైన మార్గం. ఆవిరి పీల్చే సమయంలో కొన్ని చుక్కల యూకలిప్టస్ నూనెను ఒక గిన్నెలో వేడినీరు (మరిగేది కాదు) కలపడం వల్ల మూసుకుపోయిన ముక్కు/నాసికా తెరుచుకుంటుంది. ఆవిరి పీల్చేటప్పుడు టవల్‌ ను పూర్తిగా కప్పి ఉంచుకోండి. ఆవిరిని పీల్చేటప్పుడు సురక్షితంగా ఉండాలి పిల్లలను దగ్గరికి రాకుండా చూసుకోవాలి.

యూకలిప్టస్ మసాజ్ ఆయిల్:
యూకలిప్టస్ ఇన్ఫ్యూజ్డ్ మసాజ్ ఆయిల్ ఒంటినొప్పుల నుంచి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది. యూకలిప్టస్-కలిగిన మసాజ్ ఆయిల్ అనాల్జేసిక్ గుణాన్ని కలిగి ఉంటుంది ఇది మంటను తగ్గిస్తుంది. మీ ఛాతీపై నూనెను సున్నితంగా మసాజ్ చేయవచ్చు. మసాజ్ చేసేటప్పుడు మీరు కొన్ని చుక్కల కొబ్బరి లేదా ఆలివ్ నూనెను కూడా జోడించవచ్చు.

ఉపయోగాలు (Benefits of Eucalyptus oil)
ఆయుర్వేదం ప్రకారం యూకలిప్టస్ ఆయిల్ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉబ్బసం, కఫం తగ్గించడంలో, సులువుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని తొలగిస్తుంది. యూకలిప్టస్ నూనెను వీపు, ఛాతీపై పూయడం వల్ల కఫాను శాంతపరచి, ఊపిరితిత్తులలో పేరుకుపోయిన శ్లేష్మం పలుచన చేస్తుంది. దీంతో ఆస్తమా లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.. చిగుళ్ల వాపు తగ్గించేయాంటీ బాక్టీరియల్ గుణాన్ని కలిగి ఉంది.

మీరు ఏదైనా దగ్గు జలుబు ఔషధాలను ఉపయోగిస్తున్నప్పుడు ముందుగా లేబుల్‌ని చదవండి. నిర్దేశించిన విధంగా ఉపయోగించండి. ఇంకా జలుబు లక్షణాలు కొనసాగితే, మీ వైద్యుడిని సంప్రదించండి అలాగే, అలెర్జీలు ఉన్నవారు, బాలింతలు, గర్భిణులు వైద్యుల సూచనలతో ఈ యూకలిప్టస్ ను ఉపయోగిచాల్సి ఉంటుంది.

Electric Vehicles కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర పోర్టల్ ను సందర్శించండి. తెలుగు రాష్ట్రాలు,  జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్  అప్ డేట్ కోసం గూగుల్ న్యూస్ (Google News) ను సబ్ స్క్రైబ్ చేసుకోండి   ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *