Home » ఎలక్ట్రిక్ వాహన తయారీలోకి మైక్రోమ్యాక్స్..!

ఎలక్ట్రిక్ వాహన తయారీలోకి మైక్రోమ్యాక్స్..!

Micromax Exploring Electric Vehicle Venture
Spread the love

Micromax : భారతీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల( Electric Vehicles ) తయారీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తోంది. న్యూఢిల్లీకి చెందిన ఈ స్మార్ట్ ఫోన్ కంపెనీ ప్రస్తుతం దేశంలోని చైనీస్ ఫోన్ల బ్రాండ్‌ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటోంది. తీవ్ర నష్టాలు వస్తుండడంతో దేశవ్యాప్తంగా ఉద్యోగులను తొలగించినట్లు తెలుస్తోంది. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు కూడా సంస్థ నుండి నిష్క్రమించారు. దేశంలో ఏథర్ ఎనర్జీ, మ్యాటర్ ఏరా, ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలకు గట్టి పోటీనిచ్చే అత్యాధునిక EVలను తయారు చేయాలని భావిస్తోంది.

టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం మైక్రోమ్యాక్స్ లో కొన్నాళ్లుగా లేఆఫ్ లు కొనసాగుతున్నాయి. గత కొన్ని నెలలుగా చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్, చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌తో సహా దాని టాప్ ఎగ్జిక్యూటివ్‌లు వెళ్లిపోయారు. సహ వ్యవస్థాపకుడు వికాస్ జైన్ – ఏప్రిల్ 2021లో రాజీనామా చేసిన తర్వాత సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు . మైక్రోమాక్స్ కంపెనీ ఆగస్టు 2014లో మార్కెట్ లీడర్‌గా ఉన్న శాంసంగ్‌ను ఇండియాలో బాన్ చేసినప్పుడు భారతదేశంలో మైక్రోమాక్స్ అగ్రశ్రేణి స్మార్ట్‌ఫోన్ కంపెనీగా అవతరించింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పాటు మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్‌లను అందించనున్నట్లు 2014లో కంపెనీ ప్రకటించింది. సంస్థ ఒక సంవత్సరం తర్వాత 10వ అతిపెద్ద ఫోన్ బ్రాండ్‌గా కూడా నిలిచింది. అయితే Xiaomi, Oppo, Vivo వంటి చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారుల రాకతో ధరల యుద్ధంలో దేశీయ కంపెనీ వెనుకబడిపోయింది.

ఫిబ్రవరిలో, కంపెనీ వ్యవస్థాపకులు రాజేష్ అగర్వాల్, సుమీత్ కుమార్, వికాస్ జైన్ మైక్రోమ్యాక్స్ మొబిలిటీ పేరుతో కొత్త సంస్థను స్థాపించారు. నివేదిక ప్రకారం, కొత్త వెంచర్ మొదట్లో ద్విచక్ర వాహనాల EVలపై దృష్టి పెడుతుందని అప్పట్లో ప్రకటించారు. మొబిలిటీ రంగంలోకి ప్రవేశించే ప్రయత్నాల్లో భాగంగా గురుగ్రామ్‌లోని కార్యాలయాన్ని పునరుద్ధరిస్తోందని వెల్లడించారు. మైక్రోమ్యాక్స్ తన ప్రణాళికలకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే EV మార్కెట్ ను ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ, టీవీఎస్, మ్యాటర్ ఏరా వంటి ప్రముఖ కంపెనీలు ఏలుతున్నాయి. నాలుగు చక్రాల EV సెగ్మెంట్‌లో ఇప్పటికే టాటా, హ్యుందాయ్, MG, మారుతి, BYD వంటి అనేక ఇతర బ్రాండ్‌లు ఉన్నాయి, ఇవి దేశంలో వివిధ ధరలకు వాహనాలను అందిస్తున్నాయి. ఒకవేళ మైక్రోమ్యాక్స్ ఈవీ రంగంలోకి వస్తే ప్రముఖ బ్యాండ్ల నుంచి తీవ్రమైన పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది.


Electric Vehicles కి సంబంధించిన అప్ డేట్స్ కోసం హరితమిత్ర పోర్టల్, తాజా వార్తల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను సందర్శించండి..

అలాగే ట్విట్టర్, ఫేస్ బుక్  లోనూ సంప్రదించవచ్చు.

One thought on “ఎలక్ట్రిక్ వాహన తయారీలోకి మైక్రోమ్యాక్స్..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *