Friday, November 22Lend a hand to save the Planet
Shadow

Xiaomi EV | షావోమి నుంచి స్మార్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్లు..

Spread the love

Xiaomi EV : చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ కంపెనీ షావోమి తొలిసారిగా  ఎలక్ట్రిక్ కారును విడుదల చేస్తోంది. షావోమి ఎస్‌యూ 7 (Xiaomi su7 ) పేరుతో తీసుకొస్తున్న ఈ కారు విక్రయించేందుకు గాను ప్రభుత్వానికి లైసెన్స్‌ కోసం దరఖాస్తు చేసుకుంది. ఈ కారును షావోమీ  బీజింగ్‌ ఆటోమోటివ్‌ ఇండస్ట్రీ హోల్డింగ్‌ కంపెనీ లిమిటెడ్‌ (బీఏఐసీ)కి కాంట్రాక్టు ఇచ్చింది. చైనా ఇండస్ట్రీ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అనుమతి కోసం కంపెనీ అప్లికేషన్ పెట్టుకుంది.

మూడు వేరియంట్లతో Xiaomi EV

కాగా ఈ శాఖ ప్రతి నెల కొత్త కార్ల వివరాలను వెల్లడిస్తుంటుంది.. షావోమి కారు వివరాలు  ఈ సంస్థ వెబ్‌సైట్‌ ద్వారానే వెలుగులోకి వచ్చింది. బీఏఐసీ వోఆర్‌వీ షావోమి బ్రాండెడ్‌ మోడల్‌లో 3 వెరియంట్లను తయారు చేయనుంది.. ఎస్‌యూ 7 మోడల్‌ ఎలక్ట్రిక్ కారులో బీవైడీ కంపెనీకి చెందిన లిథియం ఆయాన్‌ పాస్పేట్‌ బ్యాటరీని వినియోగిస్తున్నారు. కాగా ఈ కారు టాప్‌ స్పీడ్‌ గంటకు 210 కిలోమీటర్లు ఉంటుంది. ఇక రెండో మోడల్‌ ఎస్‌యూ 7 మ్యాక్స్‌ (xiaomi su7 max) సీఏటీఎల్‌ నికెల్‌ కోబాల్ట్‌ లిథియం బ్యాటరీతో వస్తున్నది.

xiaomi EV su7 max

టాప్ స్పీడ్ గంటకు 265 కి.మీ

ఈ Xiaomi కారు టాప్‌ స్పీడ్‌ 265 కి.మీ. మూడో మోడల్‌ ఎస్‌యూ 7 ప్రో (xiaomi su7 pro) పేరుతో వస్తుంది. ఈ మూడు కార్లకు ముందు భాగంలో ఎంఐ (MI) లోగోతో వస్తున్నాయి. వెనుక వైపు షావోమి కంపనీ బ్రాండ్‌ పేరు ఉంటుంది. ఈ కార్లలో లైడర్‌ సెన్సర్‌ ఉంటుంది. బీ పిల్లర్‌పై కెమెరా ఉంటుంది. ఇందులో ఫేస్‌ రికగ్నిషన్‌ ఆన్‌లాకింగ్‌ ఫీచర్‌ ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఎస్‌యూ 7 మోడల్‌లో 220 కిలోవాట్‌ మోటార్‌ కలిగి  రియల్‌ వీల్‌ డ్రైవ్‌తో, మరొకటి 495 కిలోవాట్‌ మ్యాగ్జిమమ్‌ పవర్‌ తో ఆల్‌ వీల్‌ డ్రైవ్‌ తో వస్తుంది. టోల్‌ చెల్లింపుల కోసం వాహనం ఆపాల్సిన అవసరం లేకుండా ఈటీసీ ఫంక్షన్‌ వ్యవస్థ ను కూడా పొందుపరిచారు. స్మార్ట్‌ ఫోన్‌ సహా కార్లలో నూ ఉపయోగించేలా హైపర్‌ఆపరేటింగ్‌ సిస్టమ్‌ దీని కోసం ప్రత్యేకం గా రూపొందించారు..

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి..

5 సీట్లతో వస్తున్న Xiaomi EV వాణిజ్యపరంగా తయారీని 2023 డిసెంబర్‌ లో ప్రారంభించింది. 2024 ఫిబ్రవరి నుంచి కస్టమర్లకు  డెలివరీ మొదలు పెట్టనున్నారు.. బీఏఐసీలో ఇప్పటికే ఈ కార్ల తయారీ ప్రారంభమైంది.. ఈ కంపెనీ ఇప్పటి కే చైనా మార్కెట్‌ కోసం మెర్‌సడెస్‌ బెంజ్‌ కారు ను ఉత్పత్తి చేస్తోంది. తాము ఈవీ కార్ల తయారీలోకి ప్రవేశిస్తున్నట్లు షోవోమి కంపెనీ 2021 లోనే ప్రకటించింది. ఇందుకోసం కంపెనీ 10బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది..


Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *