Monday, January 20Lend a hand to save the Planet
Shadow

Tata Punch EV: త్వరలో టాటా పంచ్ ఈవీ వస్తోంది.. ధర, ఫీచర్లు ఇవీ..!

Spread the love

Tata Punch EV : ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ లో జెట్ స్పీడ్ వేగంతో వెళ్తోంది. టాటా మోటార్స్..  ఇప్పటికే టాటా నుంచి టాటా టియాగో ఈవీ, టిగోర్ నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్ లోకి రాగా వినియోగదారుల నుంచి భారీ స్పందన వచ్చింది. ఇప్పటికీ కొనుగోళ్లలో టాప్ రేంజ్ లో ఉంది. అయితే తాజాగా టాటా మోటార్స్ (Tata Motors) టాటా పంచ్ ఈవీని కూడా విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ కొత్త వేరియంట్ వివరాలు బయటకు వచ్చాయి. ఈ కారు అతిత్వరలోనే లాంచ్ కానుంది.

Tata Punch Electric SUV: టాటా మోటార్స్ త్వరలో టాటా పంచ్ ఈవీ కారును మార్కెట్ లో లాంచ్ చేయనుంది. దీని కోసం చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కారు భారత్ లో అమ్మకానికి అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా ఉంది. టాటా మోటార్స్ తన పోర్ట్‌ఫోలియోలో నెక్సాన్ ఈవీ కంటే దిగువన పంచ్ ఈవీని నిలపనుంది. టాటా పంచ్ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ వేరియంట్లలో వస్తుంది. ఇందులో మిడ్ రేంజ్, లాంగ్ రేంజ్ గా ఉండనున్నాయి.

రేంజ్, బ్యాటరీ వివరాలు

టాటా పంచ్ లాంగ్ రేంజ్ ఈవీ 30KWh బ్యాటరీ ప్యాక్ సెటప్‌తో వస్తుంది. ఇది సింగిల్  ఛార్జ్‌కి 325 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుందని సమాచారం. ఇదివరకే వచ్చిన  టియాగో ఈవీ, టిగోర్ ఈవీలకు ప్రత్యామ్నాయంగా టాటా పంచ్ ఈవీ ఉంటుంది. మిడ్ రేంజ్ కంటే కొంచెం తక్కువ స్థాయిలో లో రేంజ్ వెర్షన్ అందుబాటులో ఉంటుంది. ఇది 125 బీహెచ్‌పీ కంటే ఎక్కువ శక్తిని ఉత్పత్తి ఉంటుందని భావిస్తున్నారు.

READ MORE  2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

డిజైన్, స్మార్ట్ ఫీచర్లు

టాటా పంచ్ ఈవీలో స్పెసిఫిక్ గ్రిల్, ఎయిరో ఇన్సర్ట్‌లతో కూడిన వీల్స్ చక్రాలు, కనెక్టెడ్ లైట్ బార్‌లతో కూడిన నెక్సాన్ ఈవీ లాంటి ఎల్ఈడీ హెడ్‌ ల్యాంప్‌లు ఉంటాయి. ఇది మరిన్ని ఫీచర్లతో పెట్రోల్ పంచ్ కంటే పెద్ద టచ్‌స్క్రీన్‌ను కలిగి ఉంటుంది. కాగా ఇది ఇల్యూమినేటెడ్ లోగో తో కొత్త స్టీరింగ్ వీల్‌ను కూడా కలిగి ఉండే చాన్స్ ఉంది. టాటా పంచ్ ఈవీ కి సన్‌రూఫ్, వైర్‌లె స్ ఛార్జింగ్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ లాంటి ప్రీమియం ఫీచర్లు ఉంటాయని చెబుతున్నారు. అంతే కాకుండా వాహనం ముందు భాగంలో ఛార్జింగ్ పోర్ట్ ఉంచిన మొట్టమొదటి టాటా ఈవీ ఇదే కానుంది. .

READ MORE  2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

Tata Punch EV ధర?

పంచ్ ధర గురించి చెప్పాలంటే ఇది ధర Tata Nexon ఈవీ కంటే తక్కువగా ఉంటుంది. కానీ టిగోర్/టియాగో ఈవీల కంటే ఎక్కువ ధర ఉంటుంది. అయితే ధర విషయంలో టాటా కాస్త అనుకూలంగానే ఉంటుందని చెబుతున్నారు. టాటా మోటార్స్ ఇప్పటికే EV సెగ్మెంట్‌లో ప్రథమ స్థానంలో ఉంది. టాటా అనేక ఈవీ అన్ని మోడళ్ల ధరలు రూ.25 లక్షల కంటే తక్కువగా ఉన్నాయి.  చాలా మంది తక్కువ ధరలో ఈవీలను ఎంచుకోవడానికి యత్నిస్తున్నందున టాటా పంచ్ ఈవీకి మొగ్గుచూపే అవకాశముంది. దీంతో టాటా అమ్మకాల సంఖ్య మరింత పెరుగుతుంది. టాటా పంచ్ లాంచ్ తర్వాత ఇది ధర పరంగా సిట్రోయెన్ ఈసీ 3 ఈవీ తో పోటీ పడవచ్చు. ఇందులో ఈ వాహనం సింగిల్ ఛార్జ్‌కి 320 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ.11.61 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

READ MORE  2025 టాటా టియాగో , ఎంజీ కామెట్ ఈవీ మ‌ధ్య తేడాలు ఏంటి… ఏది బెస్ట్‌?

Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Hyundai Creta Electric Specifications detials ఈ ప్రాణాంతకమైన మొక్కలకు దూరంగా ఉండడండి..