హైదరాబాద్‌కు చెందిన అనే స్టార్టప్ కంపెనీ బ్రిస్క్ ఈవీ (Brisk Ev) తన మొదటి ఉత్పత్తి అయిన ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ( Brisk origin pro electric scooter) ను విడుదల చేసింది. కంపెనీ గత కొన్నేళ్లుగా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పని చేస్తోంది. బ్రిస్క్ EV రెండు వేరియంట్‌లలో వస్తుంది అవి మొదటిది ఆరిజిన్ రెండోది ఆరిజిన్ ప్రో.
ఆరిజిన్ ప్రో అనేది టాప్ ఎండ్ వేరియంట్. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 333 కిలోమీటర్ల పరిధిని ఇస్తుందని కంపెనీ చెబుతోంది. ఇప్పుడు ఇది ప్రోటోటైప్ చివరి ప్రయోగం 2024 జనవరిలో నిర్వహించనుంది. అయితే చివరి టెస్టింగ్ అనంతరం మార్పులను చేయనున్నారు.
బ్రిస్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ( Brisk origin pro electric scooter) లో 90 x 90 సెక్షన్ 12 అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లను ఉపయోగిస్తున్నారు. ముందు వెనుక డిస్క్ బ్రేకింగ్ సెటప్‌ను అందిస్తున్నారు. ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్ ను చూడవచ్చు. వెనుక వైపు మోనోషాక్ సస్పెన్షన్‌ని ఉపయోగించారు. ఈ సస్పెన్షన్ పనితీరు చాలా బాగుంది.
రెండు బ్యాటరీలతో Brisk origin pro electric scooter
ఇక బ్యాటరీ విషయానికి వస్తే, బ్రిస్క్ ఆరిజిన్ ప్రో లో సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లో మాదిరిగా రెండు బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుంది. బూట్ స్పేస్‌లో ఒకటి స్థిరంగా ఉంటుంది. మరొకటి పోర్టబుల్‌గా ఉంటుంది. ఇందులో 4.8 KW స్థిరమైన బ్యాటరీతో పాటు మరొటి2.1 KW పోర్టబుల్ బ్యాటరీని అమర్చారు.
ఈ రెండు బ్యాటరీలను కలపడం ద్వారా, ఈ బ్రిస్క్ ఆరిజిన్ ప్రో మొత్తం బ్యాటరీ సామర్థ్యం 6.9 KW అవుతుంది. ఈ 6.9 KW బ్యాటరీ సహాయంతో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏకంగా ఒక్కసారి చార్జి చేస్తే 330 కిలోమీటర్ల పరిధి వస్తుందని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.
ఇక మోటార్ విషయానికొస్తే.. బ్రిస్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 5.7 KW పీక్ పవర్డ్ మిడ్ డ్రైవ్ మోటార్‌ను ఉపయోగించారు. ఇది స్పోర్ట్స్ మోడ్‌లో 85 km/h గరిష్ట వేగాన్ని అందిస్తుంది. వెనుక చక్రం నుండి శక్తి రెండు బెల్టుల ద్వారా ట్రాన్స్ ఫర్ చేయబడుతుంది.
కొత్త బ్రిస్క్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఎకో మోడ్, బ్రిస్క్ మోడ్, స్పోర్ట్స్ మోడ్ అనే మూడు రైడింగ్ మోడ్‌లతో వస్తుంది.
ఫీచర్ల విషయానికొస్తే, ఈ స్కూటర్ 7 అంగుళాల డిజిటల్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది బ్యాటరీ జీవితం, వేగం, నావిగేషన్ తోపాటు మరిన్ని వివరాలను డిస్ ప్లేపై చూపిసత్ుంది. ఈ స్కూటర్‌లో గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ ఉంటుంది.
కాగా ఈ ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ ధరను వెల్లడించనప్పటికీ. కానీ అంచనా ధర 1.5 లక్షలు ఎక్స్-షోరూమ్ ఉండవచ్చని భావిస్తున్నారు.
Green Mobility, Environment అప్ డేట్స్ కోసం హరితమిత్ర ను సందర్శించండి.
తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
One thought on “సింగిల్ చార్జిపై 333 కి.మీ ప్రయాణించే ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది.. తుది పరీక్షల్లో బ్రిక్స్ ఎలక్ట్రిక్ ప్రొటోటైప్..”