BGauss C12i : అన్ని వర్గాలవారికి కావలసిన ఫీచర్లు, ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ BGauss C12. ఇది రోజువారీ అవసరాలకు ఎంతో అనువుగా ఉంటుంది. ఇది ఈసెగ్మెంట్‌లో సిటీ ప్రయాణానికి తగిన వేగం, యాక్సిలరేషన్ తోపాటు మంచి రైడింగ్ రేంజ్‌ను అందిస్తుంది. ఇది ఈ రోజుల్లో చాలా అవసరమైన అనేక స్మార్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. ముంబైకి చెందిన ఎలక్ట్రిక్ ఆటోమొబైల్ కంపెనీ నుంచి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించిన అన్ని ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై ఒకసారి పరిశీలిద్దాం..
BGauss C12i Specifications
BGauss C12 Electric Scooter లో రెండు వేరియంట్లు ఉన్నాయి. మొదటిది BGauss C12i Max సింగిల్ చార్జిపై 135కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణిస్తుంది. ఇందులో 3.2kWh లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. ఇక రెండోది BGauss C12 EX సింగిల్ చార్జిపై 85కిలోమీటర్ల వరకు సర్టిఫైడ్ రేంజ్ అందిస్తుంది. ఇందులో 2.0kWh బ్యాటరీని వినియోగించారు. ఇవి రెండూ గంటకు 50 నుంచి 60కిలోమీటర్ల వేగంతో వెళ్లగలవు. ఇందులోని PMSM HUB మోటార్ గరిష్టంగా 2500W శక్తిని ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా 150 కిలోల బరువును మోస్తాయి. అలాగే 15 డిగ్రీల (±2° డిగ్రీ) ఏటవాలు రోడ్లను సునాయసంగా అధిరోహించగలవు. BGauss స్కూటర్ యొక్క బ్యాటరీని ఛార్జ్ చేయడానికి వాహనంతో పాటు అందించిన 10-ఆంపియర్ పోర్టబుల్ ఛార్జర్ ద్వారా దాదాపు ఏడు గంటల్లో పూర్తి బ్యాటరీ ఛార్జ్‌ని పొందవచ్చని కంపెనీ పేర్కొంది.
ఇతర స్పెసిఫికేషన్ల విషయానికొస్తే.. ఈ Scooter ట్యూబ్యులర్ ఛాసిస్‌పై కూర్చుని హైడ్రాలిక్ టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్ 4 స్టేజ్ అడ్జస్టబుల్ డబుల్ హైడ్రాలిక్ రియర్ సస్పెన్షన్‌పై నడుస్తుంది. ఇది 12-అంగుళాల ఫ్రంట్ వీల్, 10-అంగుళాల వెనుక చక్రంలో అమర్చబడి.. రెండు చివరల 130mm డ్రమ్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. రెండు చక్రాలు 90mm వెడల్పు గల ట్యూబ్‌లెస్ టైర్లను కలిగి ఉంటాయి.
BGauss C12i డిజైన్
BGauss C12 ఎలక్ట్రిక్ స్కూటర్ క్రోమ్ లేదా స్టెయిన్‌లెస్ స్టీల్ తో రౌండ్ LED హెడ్‌లైట్, షాకర్ రాడ్‌లను కప్పి ఉంచే విశాలమైన ఫ్రంట్ ఫెండర్ దిగువన ట్రయాంగిల్ టర్నింగ్ ఇండికేటర్లతో కూడిన డ్యూయల్-టోన్ ఫ్రంట్ ఆప్రాన్. పై వైపున చివరన బ్రాండ్ లోగో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది సింగిల్-సీట్ డిజైన్, వైడ్ పిలియన్ గ్రాబ్ రైల్, సైడ్ ఇంటికేటర్లతో LED టెయిల్ లైట్, వెనుక రిఫ్లెక్టర్ మరియు సైడ్ ప్యానెల్‌లపై గ్రాఫిక్స్ మోడల్ బ్రాండింగ్‌ను కలిగి ఉంటుంది.
డైమెన్షనల్‌గా.. దీని పొడవు 1825mm, వెడల్పు 697mm, ఎత్తు 1190mm, వీల్‌బేస్ 1292mm, గ్రౌండ్ క్లియరెన్స్ 155mm ఉంటుంది. ఇక సీట్ ఎత్తు 765mm. ఇంకా, దాని బరువు 107 కిలోలు ఉంటుంది. BG C12i Max లేదా కొత్త BG C12i EX వేరియంట్లలో 23 లీటర్ బూట్ స్పేస్‌ను చూడొచ్చు. ఇద ఫుల్ సైజు హెల్మెట్ ఈజీగా క్యారీ చేయవచ్చు. అలాగే మీ రోజువారీ నిత్యావసర వస్తువులు సులభంగా స్టోర్ చేసుకోవచ్చు.
BGauss C12i ఫీచర్లు
ఈ స్కూటర్ కాంబి బ్రేకింగ్ సిస్టమ్‌తో అమర్చబడి ఉంటుంది. ఇది కేవలం ఒక బ్రేక్ లివర్ తో కూడా రెండు చక్రాలపై బ్రేకింగ్ ఫోర్స్‌ను ఉపయోగించడానికి వీలుంటుంది. BGauss C12 USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంటుంది. ఇది ప్రయాణంలో మొబైల్ ఫోన్‌ను ఛార్జ్ చేయడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా.. ఇది ఫ్రంట్ స్టోరేజ్ బాక్స్, అండర్-సీట్ స్టోరేజ్, పాస్ లైట్, రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్, సైడ్ స్టాండ్ సెన్సార్, డిజిటల్ స్పీడోమీటర్, ట్రిప్ మీటర్, లో బ్యాటరీ ఇండికేటర్‌తో కూడిన CAN-ఎనేబుల్డ్ డిజిటల్ కన్సోల్‌ను కలిగి ఉంది..
BGauss C12 కలర్స్
ఈ స్కూటర్ ఎల్లో టెక్నో, రెడ్ బ్లాక్, పెరల్ వైట్, ఫోలేజ్ గ్రీన్, షైనీ సిల్వర్ మరియు మాట్ బిగౌస్ బ్లూ అనే ఆరు రంగుల ఎంపికలతో ఒకే ‘స్టాండర్డ్’ వేరియంట్‌లో అందుబాటులో ఉంది.
ధర, వారంటీ, ఫైనాన్స్ ఆప్షన్స్..
BGauss C12i Max Price: ఎక్స్-షోరూమ్ ధర ₹1,26,153/- గా ఉంది. BGauss C12 EX ఎక్స్ షోరూం ధర 1,05,000/- ఉంది. ఇది మీరు ఉంటున్న నగరాన్ని బట్టి మారవచ్చు. కచ్చితమైన ధరలు తెలుసుకునేందుకు మీ దగ్గర్లోని షోరూంను సందర్శించి గానీ లేదా కంపెనీ అధికారిక వెబ్ సైట్లో సంప్రదించి గానీ చెక్ చేసుకోవచ్చు.
ఆఫ్టర్‌సేల్స్ పరంగా BG C12 3 సంవత్సరాలు లేదా 36,000 కిమీల వారంటీతో వస్తుంది. ఏది ముందుగా వస్తే అది వర్తిస్తుంది. మీరు కొంత మొత్తాన్ని చెల్లించి మీ వారంటీని 5 సంవత్సరాలు లేదా 50,000 కి.మీలకు పొడిగించవచ్చు. ఫైనాన్స్ ఎంపికలు- ₹2,437/- నుండి ప్రారంభమయ్యే EMI సౌకర్యం ఉంది. అలాగే కేవలం ₹6,197/- తక్కువ డౌన్ పేమెంట్ తో ఈఎంఐ ప్రారంభమవుతాయి.
Power Train Type | PMSM HUB |
Motor Power Peak (w) | 2500 |
Continuous power (w) | 1500 |
Max Speed (km/h) | 60+/-2 |
Acceleration 0-40 km/hr | 8.5 seconds |
ARAI Certified Range | 135* Kms |
Motor IP Rating | IP 67 |
Gradeability (Single Rider) | 15±2° |
Controller Rating | IP65 |
Mode 1 – Eco (Km/h) | 45+/-2 |
Mode 2 – Sport (Km/h) | 60+/-2 |
ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..
Simply super
👍👍👍👍