
EV News | వాహనదారులకు గుడ్ న్యూస్ ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలకు భారీగా ప్రోత్సాహకాలు
EV News | దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఏమాత్రం దిగిరావడం లేదు. ఇంధన ఖర్చులు వాహనదారులకు మరింత భారంగా మారుతోంది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడుతోంది. ఎలక్ట్రిక్ వాహనాల (Electric Vehicles) ఆవశ్యకత పెరిగింది. ముఖ్యంగా వాహనాల ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పలు వాహనాల తయారీ కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. దీంతో వాహనదారులు కూడా ఎలక్ట్రి వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు.మరోవైపు కేంద్ర ప్రభుత్వం (Central Govt) కూడా ఈవీ తయారీ కంపెనీలను ప్రోత్సాహించాని భావిస్తోంది. రిజిస్టేష్రన్ ఛార్జీలను గణనీయంగా తగ్గిస్తున్నాయి. ఇది అమల్లోకి వస్తే రానున్న రెండు మూడేళ్లలో ఈ తరహా వాహనాలకు భారీగా డిమాండ్ పెరగనుంది. కేంద్ర ప్రభుత్వం కాలుష్యానికి కారణమవుతున్న పెట్రోల్, డీజిల్ వాహనాలను తగ్గించి కేవలం ఎలక్ట్రిక్ వాహనాలు లేదా ...