Tuesday, December 3Lend a hand to save the Planet
Shadow

Video | ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ కేంద్రాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా.. అయితే ఓసారి చూడండి..

Spread the love

Eco-Friendly Polling Booths | తమిళనాడులోని ఈ పర్యావరణ అనుకూల పోలింగ్ బూత్‌లు అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి. ఈ పోలింగ్ కేంద్రాలను పూర్తిగా కొబ్బరి, వెదురు ఆకులతో అందంగా తీర్చిదిద్దారు. ఈ ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూత్ కు సంబంధించిన వీడియోను ఐఏఎస్ ఆఫీసర్ సుప్రియా సాహు ఇటీవల షేర్ చేయ‌గా.. అది నెట్టింట‌ వైరల్‌గా మారింది. ఈ వీడియో క్లిప్ తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లాలో ఒక ప్ర‌త్యేక‌ “గ్రీన్ పోలింగ్ బూత్ ను చూపిస్తుంది. ఈ వినూత్న బూత్, జిల్లా కలెక్టర్, TN క్లైమేట్ చేంజ్ మిషన్ వాలంటీర్ల మధ్య సహకారం, ప‌ర్యావ‌ర‌ణంపై స్పృహ‌ను హైలెట్ చేస్తుంది. వేవిలో ఎండలు తీవ్రమైన నేపథ్యంలో ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా నీడ తాటి, కొబ్బరి ఆకులతో చలువ పందిళ్లు వేశారు. అలాగే అలంకరణ కోసం సహజ పదార్థాలు, పువ్వులతో పోలింగ్ బూత్ ను అందంగా తీర్చిదిద్దారు. ఈ పర్యావరణ అనుకూలమైన బూత్‌లు మొత్తం 10 వ‌ర‌కు ఏర్పాటు చేశారు. ఇవి ఒక కొత్త‌ద‌నానికి, అలాగే పర్యావరణ స్పృహకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఎలక్ట్రిక్ వాహనదారులకు శుభవార్త.. చార్జింగ్ పాయింట్ల కోసం కీలక అప్ డేట్

ఈ ప్రత్యేకమైన పోలింగ్ బూత్‌ల (Eco-Friendly Polling Booths ) లో చల్లగా, సహజమైన నీడను అందించేందుకు కొబ్బరి, వెదురు ఆకులను ఉపయోగించారు. స్థానిక సంప్రదాయాన్ని అనుస‌రించి, అరటి, తాటి ఆకులతో తోర‌ణాలు ఏర్పాటు చేసి ఓట‌ర్ల‌కు స్వాగ‌తం ప‌లికారు. ఈ బూత్‌ల లో ఫ్లెక్సీల‌కు బ‌దులుగా వ‌స్త్రాల‌పై చేతితో రాసిన బ్యానర్‌లను ప్ర‌ద‌ర్శించ‌డం మ‌రో విశేషం. మొక్క‌ల‌ను పెంచి సంర‌క్షించాలి. ప్లాస్టిక్ ను నివారించాలి అనే భావ‌న‌ను ఓటర్ల‌లో క‌లుగ చేసేందుకు ఈ వినూత్న‌మైన ఎకో ఫ్రెండ్లీ పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేసినట్లు స్థానిక అధికారులు తెలిపారు. దీనిపై ఓట‌ర్లు, ప‌ర్యావ‌ర‌ణ ప్రేమికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

 

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.. అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *