Telangana | తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఆయిల్ పామ్ (Oil Plam ) సాగుపై ఫోకస్ పెట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageshwar Rao ) సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాలో రెండు పామాయిల్ మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్ పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని తెలిపారు. పాలమూరు జిల్లాలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న రైతు పండుగ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొని మాట్లాడారు.
వలస జిల్లాగా పేరు పొందిన మహబూబ్ నగర్ (Mahaboob Nagar) జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎంతో కీలకమైనదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. దీనికి అత్యంత ప్రాధాన్యమిచ్చి త్వరగా పూర్తి చేయించాలని సభా ముఖంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఎండాకాలం పంట మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయని లేకుంటే బియ్యం నూకల శాతం అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల ఎండాకాలం పంటకు నీరు ఎప్పుడు విడుదల చేస్తారో త్వరగా నిర్ణయం తీసుకోవాలని మంత్రిని కోరారు. రైతులకు అండగా ఉండేందుకు.. ఏది మంచిదో రైతులే చెప్పాలని, మీ సలహాలు సూచనలు వినేందుకే ఈ రైతు సదస్సును ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల అభిప్రాయం మేరకు వారికి మేలు చేసే పథకాలనే కొనసాగిస్తామన్నారు. రైతులు పామాయిల్ (Oil Plam ) సాగు చేయాలని 4 సంవత్సరాలు పెట్టుబడి ప్రభుత్వమే భరిస్తుందని, ఈ నాలుగేళ్ల అంతర పంట సాగు చేసి అత్యధిక లాభాలు పొందవచ్చని తెలిపారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..