
ఇందిర డెయిరీతో ఏడాదికి రూ.24 కోట్లు మహిళలకు ఆదాయం
Indira Mahila Dairy | దేశం మన వైపు చూసేలా ఇందిరా మహిళా డెయిరీ విజయం సాధించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka) ఆకాంక్షించారు. మధిర(Madhira)లో ఇందిరా డెయిరీ లోగో ఆవిష్కరించి మహిళా సంఘాల సభ్యులతో ఆయన మాట్లాడారు. వ్యవసాయానికి తోడు రైతలు పాడి పరిశ్రమతో ఆదాయాన్ని పెంపొందించుకోవాలని కోరారు. ఆ ఆలోచనతోనే ఇందిరా మహిళా మహిళా డెయిరీ(Indira Mahila Dairy)ను 2011లో రూపకల్పన చేశామని తెలిపారు. స్వశక్తి మహిళా సంఘాలచే పాడి పరిశ్రమ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. ఇందిరా మహిళా డెయిరీ ద్వారా మహిళలకే పాడి పశువులు అందించి, పాల సేకరణ నుంచి ప్యాకింగ్, బై ప్రోడక్ట్ (వెన్నె, మజ్జిగ, పెరుగు, నెయ్యి, స్వీట్స్) ఉత్పత్తి, మార్కెటింగ్ చేసి లాభాలు పొందాలని చెప్పారు. ఇందిరా మహిళా డెయిరీ ఏర్పాటు కోసం 9.5 ఎకరాల స్థలం సేకరించి భూమి పూజ కూడా చేశామని తెలిపారు.
ఇందిరా మహిళా డెయిరీలో 20 వేల మహిళలు సభ్యులుగా ఉన్నారని, వీరికి తలా రెండు పాడి పశువులు అందిస్తామని, వీటి ద్వారా రోజూ దాదాపు 2 లక్షల 40 వేల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతుందని తెలిపారు. ఈ పాల ద్వారా నెలకు రూ.25 కోట్లకు పైగా మహిళలు సంపాదించే చాన్స్ ఉందని తెలిపారు. పాలతోపాటు మజ్జిగ, నెయ్యి, వెన్న, స్వీట్స్ అమ్మకాలు కూడా కలిపితే ఏడాదికి ఇందిరా మహిళా డెయిరీ టర్నోవర్ 500 కోట్లు దాటుతుందని అన్నారు.
దసరా పండుగ సందర్భంగా బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్ ను ప్రారంభించామని, ఇప్పుడు దీపావళి సందర్భంగా ఇందిరా మహిళా డెయిరీ లోగో ఆవిష్కరించామని తెలిపారు. అమూల్ డైరీ, విజయ డెయిరీ, హెరిటేజ్ డెయిరీలను మించి మనం వ్యాపారం చేయాలని కోరారు. ఇందిరా మహిళా డెయిరీలో పాల ఉత్పత్తి నుంచి విక్రయం వరకు మహిళలే ఉండేలా కార్యాచరణ తయారు చేశామని అన్నారు. గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేశామని, 5 మండలాల్లోనీ నిరుద్యోగ యువతకు పశువుల దాణా తయారీ, ప్యాకింగ్ సరఫరా యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. పశువులకు అవసరమైన దానా, పచ్చిగడ్డి ఇంటి వద్దకే వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని ఆలోచన చేస్తున్నామన్నారు. పశువుల ఆరోగ్య సమస్యల పరిష్కారానికి అంబులెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.
హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..