Piaggio Electric Scooter | ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ పియాజియో నుంచి కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు వస్తున్నాయి. పర్యావరణానికి మేలు చేస్తే మెరుగైన సేఫ్టీ మెకానిజంతో పాటు హై-ఎండ్ స్కూటర్ ఫ్యాషన్ తో ముందుకు వస్తున్నాయి. పియాజియో లో బ్యాటరీ కెపాసిటీని బట్టి మూడు మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో పియాజియో 1, పియాజియో 1+, పియాజియో యాక్టివ్.. ఇవి యూజర్ ఫ్రెండ్లీ స్కూటర్ గా ఉంటాయి.
ఇది ఉపయోగించడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇది స్పోర్ట్ , ఎకో మోడ్ల మధ్య మారడానికి హ్యాండిల్‌బార్‌కు కుడివైపున ఉన్న MAP బటన్ రూపంలో రిమోట్ యాక్సెస్‌ను కూడా కలిగి ఉంది.స్పోర్ట్ మోడ్ ఇంజిన్ శక్తివంతమైన రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ECO మోడ్ ఎక్కువ రేంజ్ ఇచ్చేందుకు ఉపయోగపడుతుంది.
పియాజియో 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధర
భారతదేశంలో పియాజియో 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ధరల విషయానికొస్తే.. దీని ధర 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని అంచనా.ఈ కంపెనీ USAలో దాని ఎలక్ట్రిక్ స్కూటర్లను $4799కి విక్రయిస్తోంది.
పియాజియో 1 ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్
బేస్ మోడల్ గరిష్ట వేగం గంటకు 45 కిమీ, ఎకో మోడ్‌లో గరిష్ట రేంజ్ 55 కిమీ, స్పోర్ట్ మోడ్‌లో గరిష్ట రేంజ్ 43 కిమీ. పియాజియో 1 యాక్టివ్ గరిష్ట వేగం గంటకు 60 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఎకో మోడ్‌లో 85 కిమీ రేంజ్ ఇస్తుంది. ఇక స్పోర్ట్ మోడ్‌లో 66 కిమీ వస్తుంది. పియాజియో 1+ మోడల్ ఎకో మోడ్‌లో 100 కిమీ రేంజ్ ిస్తుంది. స్పోర్ట్ మోడ్‌లో 68 కి.మీ వరకు ప్రయాణించవచ్చు. .పియాజియో 1 వేరియంట్ లో 10 కిలోల బరువున్న 1.4 kWh బ్యాటరీ అమర్చారు. పియాజియో 1+, పియాజియో 1 యాక్టివ్ వేరియంట్లలో 15 కిలోల బరువున్న అధిక సామర్థ్యం గల 2.3 kWh బ్యాటరీని ఉపయోగించారు.
- Piaggio 1: 45 km/h వేగం, ECO*లో 55 km వరకు పరిధి, SPORTలో 43 km వరకు (WMTC సైకిల్)
- Piaggio 1+: 45 km/h వేగం, ECO*లో 100 km వరకు పరిధి, SPORTలో 68 km వరకు (WMTC సైకిల్)
- పియాజియో 1 యాక్టివ్: 60 కిమీ/గం వేగం, ECO*లో 85 కిమీ పరిధి, SPORTలో 66 కిమీ వరకు (WMTC సైకిల్)
పియాజియో 1 స్పెసిఫికేషన్లు
ఎలక్ట్రిక్ హబ్ మోటార్ : స్కూటర్ పియాజియో కంపెనీ అభివృద్ధి చేసిన ఎలక్ట్రిక్ హబ్ మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. కొత్త పియాజియో 1 వెర్షన్ కొత్త 2.2 , పియాజియో వన్ ప్లస్ 3 kW ఎలక్ట్రిక్ మోటారును అమర్చారు. అయితే పియాజియో 1 యాక్టివ్ మోడల్ 2 kW శక్తిని అందిస్తుంది .
డిటాచబుల్ బ్యాటరీ
బ్యాటరీని కేవలం కొన్ని సెకన్లలో స్కూటర్ నుంచి బయటకు తీసి మీకు వీలు అయిన చోట ఛార్జ్ చేసుకోవచ్చు. మీ ఇల్లు, లేదా కార్యాలయం లేదా మరెక్కడైనా సులభంగా తీసుకువెళ్లవచ్చు. కొత్త 1 వెర్షన్ 1.4 kWh బ్యాటరీతో 10 కిలోల బరువుతో వస్తుంది, అయితే యాక్టివ్ 1 బ్యాటరీ 2.3 kWh సామర్థ్యం కలిగి ఉంటుంది. ఇది 15 కిలోల బరువు ఉంటుంది. బ్యాటరీలకు ఎటువంటి నిర్వహణ లేదా ప్రత్యేక జాగ్రత్తలు అవసరం లేదు. వాహనంతో పాటు వచ్చే ఛార్జర్‌ని ఉపయోగించి రీఛార్జ్ చేయవచ్చు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..