Gogoro JEGO Scooter | తైవాన్‌కు చెందిన గొగోరో కంపెనీ ఇటీవలే జెగో పేరుతో సరికొత్త ఎలక్ట్రిక్ స్మార్ట్ స్కూటర్‌ను పరిచయం చేసింది. ఈ స్కూటర్ ఆకర్షణీయమైన డిజైన్ తో వస్తోంది. గొగోరో తైవాన్‌లో జెగో స్మార్ట్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. మార్కెట్‌లోకి వచ్చిన మొదటి వారంలోనే తన సొంత వాహన విక్రయాల రికార్డులను అధిగమించింది. గొగోరో రూపొందించిన ఈ కొత్త స్మార్ట్ స్కూటర్ డిజైన్ చాలా సింపుల్ గా ఉంది. ఈ స్కూటర్ ఫుల్ LED, ఫుల్-కలర్ క్లియర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. రైడర్‌కు స్పష్టమైన, పవర్ ఫుల్ విజువల్స్‌ను అందిస్తుంది.
Gogoro JEGO స్పెసిఫికేషన్స్..
- రేంజ్ : 162 కి.మీ
- టాప్ స్పీడ్ : గంటకు 68 కి.మీ
- బూట్ స్పేస్ : 28 లీటర్లు
- ఫీచర్లు ఎకో-స్పీడీ హబ్ మోటార్
- సీటు- 68 సెం.మీ వరకు ఉంటుంది.
ఇది వైబ్రేషన్‌లు, ఎగ్జాస్ట్ ఎమిషన్ ను తొలగిస్తుంది, పర్యావరణ ప్రభావాన్ని కూడా తగ్గించడంతోపాటు సున్నితమైన క్లీనర్ రైడ్‌ను అందిస్తుంది. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్ ఇందులో ఉంటుంది. ఈ స్కూటర్ లో అధునాతన బ్యాటరీ సాంకేతికతను పొందుపరిచారు. నమ్మకమైన పనితీరు, లాంగ్ రైడ్‌ల కోసం ఎక్కువ కాలం ఉండేలా బ్యాటరీ రేంజ్ అందిస్తుంది. జెగో స్కూటర్ డ్యూయల్, సింగిల్ బ్యాటరీలలో వస్తుంది . డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లను ఇందులో అమర్చారు.
అదనంగా, సింగిల్-క్లిక్ రివర్స్ ఫీచర్ ఇందులో ఉంది. వినియోగదారులను వెనుకకు, ముందుకు బండిని నడపడానికి వీలు కల్పిస్తుంది.
Gogoro JEGO కలర్స్
గొగోరో జెగో స్మార్ట్ స్కూటర్ నాలుగు ఆకర్షించే రంగుల్లో అందుబాటులో ఉంది. ఇది వీధుల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది.
- ఎరుపు
- పసుపు
- నీలం
- బూడిద రంగు
- తెలుపు
Gogoro JEGO ధర
Gogoro JEGO స్మార్ట్‌స్కూటర్‌ను ఎక్కు మందికి అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో గొగోరో తక్కువ ధరకే తీసుకు వచ్చింది. ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం USD$760 ప్రభుత్వ సబ్సిడీల తర్వాత ఆకర్షణీయమైన ప్రారంభ ధరతో అందిస్తోంది. ప్రస్తుతం, కంపెనీ భారతదేశంలో అదే మోడల్‌ను అందించడం లేదు, అయితే దాని మాదిరిగానే ఉన్న మోడల్ గొగోరో క్రాస్‌ఓవర్ భారతదేశంలో రూ. 1.20 లక్షలకు (ఎక్స్-షోరూమ్) కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..