Solar Power | తెలంగాణ రాష్ట్రం 2035 నాటికి 40 వేల మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రంగా ఎదుగుతుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన గ్రీన్ పవర్ ఎనర్జీ పెట్టుబడిదారుల సమావేశంలో భట్టి విక్రమార్క మాట్లాడారు. ప్రధానమంత్రి మోదీ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించారు. ఈ సదంర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. సోలార్ రంగం (Solar Power )లో పెట్టుబడులు పెట్టేందుకు ఔత్సాహిక పెట్టుబడిదారులు ముందుకురావాలని, హైదరాబాద్ లో అన్ని అవకాశాలను కల్పిస్తున్నట్లు వివరించారు. గ్రీన్ పవర్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం సమగ్ర ఇంధన విధానాన్ని అభివృద్ధి చేస్తోందని చెప్పారు.
పెరుగుతున్న ఇంధన అవసరాలను సమతుల్యం చేయడం స్థిరత్వానికి మార్గమని తెలిపారు. తెలంగాణలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ను ముందుకు తీసుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. సమావేశంలో ప్రధాని మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గోవా, రాజస్థాన్, చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రిలతో పాటు కేంద్ర గ్రీన్ పవర్ మంత్రి, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్లు ముషారఫ్, వరుణ్ రెడ్డి, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ భాస్కర్ తదితరులు హాజరయ్యారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..