Agri News | తెలంగాణ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వరి సన్నాలకు క్వింటాకు రూ.500 బోనస్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే సన్న వడ్లు పండించిన రైతులకు క్వింటాలకు రూ.500 చొప్పున బోనస్ ఇవ్వనున్నట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరోవైపు రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు, హెల్త్ కార్డుల మంజూరు కోసం కోసం గైడ్ లైన్స్ రూపొందించేందుకు గాను మంత్రి ఉత్తమ్ కుమార్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది. సోమవారం సెప్టెంబర్ 16 సచివాలయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన భేటీ అయిన సబ్ కమిటీ.. రేషన్, హెల్త్ కార్డుల జారీ విధివిధానాలపై చర్చలు జరిపింది.
ఈ సమావేశం అనంతరం సమావేశంలో తీసుకన్న నిర్ణయాలను మంత్రి ఉత్తమ్ కుమార్ మీడియాకు వెల్లడించారు. సన్న వడ్లకు బోనస్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ ఖరీఫ్ సీజన్ నుంచే అన్నదాతలకు రూ.500 బోనస్ ఇస్తామని వెల్లడించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే సన్న వడ్లకు క్వింటాలకు కనీస మద్దతు ధర ఇవ్వడంతో పాటు రూ.500 బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో తాజాగా సన్న వడ్లకు బోనస్ ఇవ్వాలని నిర్ణయించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Green Mobility, Solar Energy, Environment, Agri News కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..