PM Rooftop Solar Scheme | ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం సోలార్ రూఫ్‌టాప్ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా కుటుంబాలు ఈ పథకం కోసం నమోదు చేసుకున్నాయి. గుజరాత్‌లోని గాంధీనగర్ జిల్లాలో సోమవారం జరిగిన 4వ గ్లోబల్ రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్ (రీ-ఇన్వెస్ట్) 2024 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ (PM Modi) కీలక వ్యాఖ్యలు చేశారు. సోలార్ రూఫ్‌టాప్ పథకం ప్రారంభించినప్పటి నుంచి.. సుమారు 3.75 లక్షల ఇళ్లలో ఇన్‌స్టాలేషన్ పూర్తయిందని, వారు ప్రస్తుతం ఉచితంగా సోలార్ విద్యుత్ ను వినియోగించుకుంటున్నారని, పేదల ప్రజలపై కరెంటు బిల్లుల భారం తగ్గిపోయిందని ప్రధాని మోదీ తెలిపారు.
PM Rooftop Solar Scheme ద్వారా తమ ఇంటిపై సోలార్‌ప్యానెల్స్ ను ఇన్ స్టాల్ చేసుకున్న వినియోగదారులు తమకు అవసరమైన విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా.. అదనపు విద్యుత్‌ను పవర్ గ్రిడ్‌కు విక్రయించడం ద్వారా ఏడాదికి రూ. 25000 ఆదాయం పొందుతున్నారని తెలిపారు. ఈ పథకం ద్వారా ఉపాధి కల్పన కూడా ఏర్పడుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. హరిత ఉద్యోగాలు వేగంగా పెరుగుతాయని తెలిపారు. ఈ పథకం ద్వారా సుమారు 20 లక్షల ఉద్యోగావకాశాలు లభిస్తాయని నరేంద్ర మోదీ వెల్లడించారు. పీఎం సోలార్ రూఫ్‌టాప్ పథకం ద్వారా భారతదేశంలోని ప్రతీ ఇల్లు విద్యుత్ ఉత్పత్తిదారుగా మారుతుందని ఆయన తెలిపారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..