Honda Activa EV | భారతదేశంలో హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎప్పుడు లాంచ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదరుచేస్తున్నారు. అయితే ఆ ప్రాజెక్ట్ కొంత ఆలస్యమవుతూ వస్తోంది. అయితే, కంపెనీ CEO, Tsutsumu Otani దీనిపై స్పందిస్తూ హోండా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను మార్చి 2025లో విడుదల చేయనున్నట్లు ధృవీకరించారు. మరోవైపు దేశంతో హోండా యాక్టీవా (Honda Activa) కు ఉన్న క్రేజ్ అంతాయింతా కాదు.. యాక్టీవాను కూడా ఎలక్ట్రిక్ వేరియంట్ గా తీసుకువస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హోండా ఎలక్ట్రిక్ స్కూటర్: వివరాలు
కొన్ని నెలల క్రితం హోండా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కోసం కర్ణాటక ప్లాంట్‌లో ప్రత్యేకమైన ఉత్పత్తి లైన్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం కోసం హోండా ఇ-స్కూటర్ ఉత్పత్తి మార్చి 2025 ప్రారంభానికి ముందు డిసెంబర్ 2024లో ప్రారంభమవుతుంది.
హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి ఇప్పటివరకు చాలా తక్కువగా తెలుసు. దాని పేరుతో సహా, మీడియాలో యాక్టివా ఎలక్ట్రిక్ అని తెలుస్తోంది. దేశంలో యాక్టివా అతిపెద్ద మార్కెట్ వాటాను రారాజుగా నిలుస్తోంది.
హోండా ఇ-స్కూటర్ కోసం పవర్‌ట్రెయిన్ ముందు వివరాలు కూడా అందుబాటులో లేవు. ప్రస్తుతం, పెద్దబ్రాండ్లలో Vida V1 మాత్రమే రిమూవబుల్ బ్యాటరీలను అందిస్తోంది, ప్రతి ఇతర ప్రధాన భారతీయ ఇ-స్కూటర్ ఫిక్స్ డ్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తోంది. హోండా ఇప్పటికే ఎంపిక చేసిన మెట్రో నగరాల్లో బ్యాటరీ-స్వాపింగ్ స్టేషన్‌ల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. దీనిని బట్టి హోండా కంపెనీ ఏ బ్యాటరీ తీసుకువస్తుందో అనేది చూడాలి. గత సంవత్సరం జరిగిన విలేకరుల సమావేశంలో ఇండియాలో కోసం రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లపై పని చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది, ఒకటి ఫిక్స్‌డ్ బ్యాటరీ ప్యాక్‌తో, మరొకటి రిమూవబుల్ బ్యాటరీ వేరియంట్. ఏ ఉత్పత్తి ముందుగా మార్కెట్‌లోకి వస్తుందో, రెండోది ఎప్పుడు వస్తుందో చూడాలి.
reen Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి.
అలాగే న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..