Battery Electric Vehicle

Battery Electric Vehicle : భ‌విష్య‌త్తంతా ఎల‌క్ట్రిక్ కార్ల‌దే.. ఆటోమొబైల్ రంగంలో విప్ల‌వం

Spread the love

Battery Electric Vehicle : ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మ‌క‌ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇక భ‌విష్య‌త్తంతా బ్యాట‌రీ ఎల‌క్ట్రిక్ వాహ‌నాలదేన‌ట‌. 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి రెండు కార్లలో ఒకటి ఈ (Battery Electric Vehicle (BEV) ఉంటుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో ఈ వాహనాల వాటా 48 శాతానికి చేరుకుంటుంద‌ని పేర్కొంటున్నాయి. 2025లో 16 శాతంగా ఉన్న BEV మార్కెట్ షేర్‌కు చాలా గణనీయమైన వృద్ధి ఇది.

మార్పున‌కు ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ మార్పు వెనుక అనేక ప్రధాన కారణాలు ఉన్నాయి. BEVలకు పెరుగుతున్న డిమాండ్, ఆటోమొబైల్ కంపెనీల వ్యూహాత్మక మార్పులు, ప్రభుత్వ ప్రోత్సాహాలు, టెక్నాలజీ అభివృద్ధి త‌దిత‌ర అంశాలు దోహ‌ద‌ప‌డుతున్నాయి. వీటిని విపులంగా పరిశీలిస్తే ఆటోమొబైల్ పరిశ్రమలో వస్తున్న విప్లవాత్మక మార్పులు క‌నిపిస్తున్నాయి.

Battery Electric Vehicle ఉత్పత్తి రంగంలో కొత్త కంపెనీలు

ప్రధాన ఆటోమొబైల్ బ్రాండ్‌లే కాకుండా అనేక కొత్త కంపెనీలు కూడా BEVల తయారీ రంగంలో ప్రవేశిస్తున్నాయి. టెస్లా, బీవైడి (BYD), వోల్‌క్స్వాగ‌న్, టయోటా, టాటా, మహీంద్రా లాంటి సంస్థలు భారీ స్థాయిలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తికి శ్రీకారం చుట్టాయి. కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో విస్తృతంగా అడుగుపెడుతున్నాయి. ప్రత్యేకంగా చైనా ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. BYD, NIO, XPeng వంటి ఆ దేశ‌ కంపెనీలు EV మార్కెట్లో పోటీ ప‌డుతున్నాయి.

బ్యాటరీ తయారీ.. టెక్నాలజీ అభివృద్ధి

EVల ఉత్పత్తిలో ముఖ్యమైనది బ్యాటరీ టెక్నాలజీ. ఈ బ్యాటరీల‌ను అధిక సామర్థ్యం కలిగి ఉండటమే కాకుండా తక్కువ సమయంలో చార్జ్ అయ్యేలా అభివృద్ధి చేస్తున్నారు. లిథియం-అయాన్ (Li-Ion) బ్యాటరీలు ఇప్పటికీ EVలకు ప్రధాన శక్తినిచ్చే వనరు కాగా సాలిడ్-స్టేట్ బ్యాటరీలు త్వరలో వాహన పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురాబోతున్నాయి.

ఉత్పత్తి ఖర్చులను తగ్గించే వ్యూహాలు

EVల తయారీ ఖర్చులను తగ్గించేందుకు ఆటోమొబైల్ కంపెనీలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి. మాస్స్ ప్రొడక్షన్, కొత్త మటీరియల్స్ వాడకం, అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నారు.

BEV మార్కెట్ ఎలా ఉండబోతోంది?

  • BEVల అమ్మకాలు : 2035 నాటికి ప్రపంచవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి 2 కార్లలో 1 కారు EV అవుతుంది
  • సంవత్సరానికి 17% వృద్ధి : 2025-2030 మధ్య BEV మార్కెట్ సంవత్సరానికి 17% వృద్ధిని కనబరిచే అవకాశం ఉంది.
  • 105 మిలియన్ వాహనాల మార్కెట్ : 2035 నాటికి మొత్తం ప్రపంచ వాహన అమ్మకాలు 105 మిలియన్ యూనిట్లను దాటనున్నాయి.
  • ప్రధాన EV మార్కెట్లు : దక్షిణ కొరియా, యూరప్, చైనా, ఇండియా వంటి దేశాల్లో ఈ వృద్ధి అధికంగా ఉంటుంది.
  • PHEVs మాంద్యం : 2030 తర్వాత ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనాలు (PHEVs) మందగిస్తాయి, బ్యాటరీ ఆధారిత EVల ప్రాధాన్యం బాగా పెరుగుతుంది. భారతదేశంలో EVల భవిష్యత్తు

భారతదేశంలో BEV వినియోగంం అగ్రభాగాన ఉండబోతోంది. ప్రస్తుతం ఈ మార్కెట్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. 2021లో 6 బిలియన్ డాల‌ర్ల‌ పెట్టుబడులు EV రంగంలో వచ్చాయి. 2030 నాటికి ఈ విలువ 20 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకోవచ్చు.

ప్రభుత్వ ప్రోత్సాహకాలు

కేంద్ర‌ ప్రభుత్వం కూడా EVల దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. FAME II స్కీమ్ (Faster Adoption and Manufacturing of Electric Vehicles) ద్వారా ప్రోత్స‌హిస్తోంది. EVల‌పై సబ్సిడీలు, పన్ను రాయితీలు ఇస్తోంది. ప్ర‌త్యేకంగా చార్జింగ్‌ స్టేషన్లను ఏర్పాటు చేస్తోంది. ఈ చర్యలతో భారతదేశ EV మార్కెట్ మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

More From Author

Indian railways Electrification

Electrification : భారతీయ రైల్వే వందేళ్ల విద్యుదీక‌ర‌ణ వేడుక‌లు..

Hydro Electric Projects

Hydro Electric Projects | జ‌ల‌విద్యుత్‌పై తెలంగాణ స‌ర్కార్ ఆస‌క్తి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *