Harithamithra Telugu News

Home Agricultue వ్యవసాయ వార్తలు MAO Suspension | పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిపై వేటు.. ఏసీబీ తనిఖీలే కారణమా?

MAO Suspension | పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారిపై వేటు.. ఏసీబీ తనిఖీలే కారణమా?

0
Peddapalli MAO K Aliveni Suspension Order by Collector Koya Sreeharsha.

Peddapalli MAO Suspension : జిల్లాలోని మండల వ్యవసాయ శాఖలో కలకలం రేగింది. విధుల్లో నిర్లక్ష్యం, ఇటీవలి పరిణామాల నేపథ్యంలో పెద్దపల్లి మండల వ్యవసాయ అధికారి (MAO) కె.అలివేణిని సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఉత్తర్వులు జారీ చేశారు.

ఏసీబీ తనిఖీలే కారణమా?

ఫిబ్రవరి 24వ తేదీన మండల వ్యవసాయ శాఖ కార్యాలయంపై ఏసీబీ (ACB) అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెలుగు చూసిన అంశాలు, కార్యాలయంలోని రికార్డుల నిర్వహణలో లోపాల ఆధారంగానే ఈ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీబీ విచారణ పూర్తిగా ముగిసే వరకు ఆమె సస్పెన్షన్ (MAO Suspension ) అమలులో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

అధికారుల మధ్య ఆధిపత్య పోరు?

గత కొంతకాలంగా పెద్దపల్లి వ్యవసాయ శాఖలో అధికారుల మధ్య సమన్వయం లోపించిందని, ఆధిపత్య పోరు నడుస్తోందని స్థానికంగా చర్చ జరుగుతోంది. అధికారుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల వల్లే ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, తద్వారా ఏసీబీ దాడుల వరకు వెళ్లడం వంటి పర్యవసానాలు చోటుచేసుకున్నాయని సమాచారం. ఈ గొడవల కారణంగానే శాఖకు సంబంధించిన కీలక విషయాలు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది.

కలెక్టర్ ఆదేశాలు: సస్పెన్షన్ కాలంలో కె.అలివేణి అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లరాదని కలెక్టర్ ఆదేశించారు. శాఖాపరమైన క్రమశిక్షణను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా హెచ్చరించారు.

Previous articleEco-friendly Holi 2026 : కెమికల్ రంగులకు బై-బై! ఇంట్లోనే హోలీ రంగులు తయారు చేయండి – ఈ ట్రిక్ మీకు తెలుసా?
Next articleE20 Fuel India : ఏప్రిల్ 1 నుండి దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ విక్రయాలు తప్పనిసరి!
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here