Bgauss will soon release 2 new electric scooters
దీపావళి నాటికి, Bgauss కంపెనీ భారతదేశ వ్యాప్తంగా 35 షోరూమ్‌లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి, 100 కంటే ఎక్కువ షోరూమ్‌లను కలిగి ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
గత సంవత్సరం తమ మొదటి ఉత్పత్తులను ప్రారంభించిన బిగాస్ Electric ఇప్పుడు మరో మైలురాయి చేరుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లో ప్రవేశపెడతామని కంపెనీ ప్రకటించింది. 2020 లో లాంచ్ చేసిన B8 మరియు A2 మోడల్స్ మార్కెట్లో విజయాన్ని సాధించాయని కంపెనీ పేర్కొంది. కొత్త ఉత్పత్తుల లాంచ్ ప్యాడ్ సజావుగా సాగేలా చూడటానికి, బ్రాండ్ షోరూమ్ ఫుట్‌ప్రింట్‌తో పాటు దాని చెకిన్ సదుపాయాన్ని పెంచే ప్రణాళికలను కూడా ప్రకటించింది. ఇంకా, రాబోయే రెండు స్కూటర్లు 100 శాతం మేడ్ ఇన్ ఇండియా అని వారు స్పష్టం చేశారు. అవి పూర్తిగా భారతదేశఃలోనే అభివృద్ధి చేయబడ్డాయి. దీపావళి నాటికి, Bgauss భారతదేశంలోని టైర్ I మరియు II నగరాల్లో 35 షోరూమ్‌లుగా మార్చాలని యోచిస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి, 100+ షోరూమ్‌లను కలిగి ఉండాలనేది లక్ష్యం.
ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్
మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ కబ్రా మాట్లాడుతూ, “గత సంవత్సరం అక్టోబర్‌లో లాంచ్ అయినప్పటి నుండి ఇండియన్ కస్టమర్ల నుండి మా ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ స్కూటర్ BGauss B8 పై అపూర్వ స్పందన వస్తోంది. మాకు లభించిన ఈ స్పందనతో నేను చాలా ఆశ్చర్యపోయాను. దేశంలో ఇ-వాహన ఔత్సాహికుల్లో పెరుగుతున్న డిమాండ్లను తీర్చడానికి ప్రస్తుత ఎలక్ట్రిక్ స్కూటర్ల పోర్ట్‌ఫోలియోలో రెండు కొత్త ఉత్పత్తులను జత చేస్తున్నామని పేర్కొన్నారు.
“ఎలక్ట్రిక్ మొబిలిటీ రవాణా భవిష్యత్తును నిర్దేశిస్తుందని మేము నిజంగా నమ్ముతున్నామని హేమంత్ తెలిపారు. తమ రెండు స్కూటర్లు దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్‌లను వేగంగా స్వీకరించడానికి సహాయపడతాయని తెలిపారు. భారతదేశంలో 100% తయారైన ఈ ఉత్పత్తులు మరింత పనితీరు, మెరుగైన శ్రేణి, అధునాతన భద్రతా ఫీచర్‌లతో పాటు మెరుగైన సాంకేతికతను అందిస్తాయని వివరించారు. ఇది భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ వృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.