Wednesday, March 19Lend a hand to save the Planet
Shadow

Delhi air pollution : ఢిల్లీలో మరింత పెరిగిన కాలుష్యం.. స్కూళ్లు బంద్, రైళ్లు, విమానాలు పరిమితం..

Spread the love

Delhi air pollution : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో ఈరోజు ఉదయం కూడా దట్టమైన పొగమంచు క‌మ్ముకుంది. గాలి నాణ్యత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దీనితో కమీషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) కఠినమైన కాలుష్య నిరోధక చర్యలను అమలు చేయాల‌ని సూచించింది. CAQM తీవ్రమైన పొగమంచును “ఎపిసోడిక్ ఈవెంట్”గా వర్గీకరించింది.

ఢిల్లీలోని ఆనంద్ విహార్ (441), ద్వారక (444), ముండ్కా (449), ఆర్‌కె పురం (437), ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ (446) వంటి ప్రాంతాల్లో ఏక్యూఐ ‘సివియ‌ర్‌’ జోన్‌లో కొనసాగుతోందని కేంద్ర కాలుష్య నియంత్రణ గణాంకాలు ప్రచురించాయి.

READ MORE  Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

AQI 401-450 ప్ర‌మాద‌క‌ర స్థాయికి చేరుకున్నప్పుడు స్టేజ్‌ III చర్యలు వర్తిస్తాయి. I మరియు II స్టేజ్‌ల కింద ఇప్పటికే అమలు చేస్తున్న నిబంధ‌న‌ల‌కు అద‌నంగా కాలుష్య నిరోధక చర్యలను చేప‌ట్ట‌నున్నారు. GRAP గాలి నాణ్యతను నాలుగు దశలుగా వర్గీకరిస్తుంది: స్టేజ్ I (AQI 201-300) “పూర్‌”. స్టేజ్ II (AQI 301-400) “వెరీ పూర్ ,” స్టేజ్ III (AQI 401-450) “తీవ్రమైనది” ఇక చివ‌ర‌గా AQI 450 కంటే ఎక్కువ ఉన్నప్పుడు సివియ‌ర్ ప్ల‌స్ ” దశ IV.

READ MORE  Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ప్రకారం, గత రెండు రోజులుగా, ఢిల్లీలో AQI స్థాయిలు 418 మరియు 424గా నమోదయ్యాయి. ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కమిషన్ (CAQM) ఢిల్లీ NCR అధికారులను ఐదో తరగతి వరకు విద్యార్థులకు తరగతులను నిలిపివేయాలని, ఆన్‌లైన్ విద్యా విధానానికి మారాలని సూచించింది.

GRAP-3 అమలులో ఉన్నందున భ‌వ‌న‌ నిర్మాణ ప‌నులు, కూల్చివేత పనులు నిలివేశారు. అన్ని మైనింగ్ కార్యకలాపాలు కూడా ర‌ద్దు చేశారు.నాన్-ఎలక్ట్రిక్, నాన్-సిఎన్‌జి, నాన్-బిఎస్-VI డీజిల్ అంతర్రాష్ట్ర బస్సులు పరిమితం చేశారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో 5 వరకు తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్ బోధనకు మారాలని పాఠశాలలను ఆదేశించింది.

READ MORE  Delhi News | ఢిల్లీ వాసులకు గుడ్ న్యూస్.. త్వరలో నగరానికి 1000 ఎలక్ట్రిక్ బస్సులు

రైళ్లు, విమానాలు ప్రభావితమయ్యాయి

Delhi air pollution : దట్టమైన పొగమంచు కారణంగా దేశ రాజధాని పరిసర ప్రాంతాలలో తక్కువ దృశ్యమానత ఉండడంతో శుక్రవారం అనేక రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడిచాయి. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ (ఎన్‌డిఎల్‌ఎస్)కి చేరుకునే దాదాపు 15 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని, అవి 1 గంట లేదా అంతకంటే ఎక్కువ ఆలస్యంగా నడుస్తున్నాయని అధికారులు తెలిపారు. దిల్లీ, వారణాసి, అమృత్‌సర్‌కు రాకపోకలు సాగించేవిమానాలు కూడా విజిబిలిటీ లేని కారణంగా ప్రభావితమైనట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Top 7 Health Benefits of Dates Ather 450X | ఏథర్ ఈవీ స్కూటర్ ఇప్పుడు రేంజ్ పెరిగింది..