Home » EVTRIC నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

EVTRIC నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

Spread the love

  ఎక్స్ షోరూం ధ‌ర 64,994 నుంచి ప్రారంభం

తిరుపతి, హైదరాబాద్ స‌హా ప‌లు న‌గ‌రాల్లో విక్ర‌యాలు

EVTRIC సంస్థ నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు లాంచ్ అయ్యాయి. అందులో ఒక మోడ‌ల్ పేరు EVTRIC యాక్సిస్, మ‌రొక‌టి EVTRIC రైడ్. వీటి రేంజ్ 75 కిలోమీట‌ర్లు. ఈ EVTRIC Eelectrci Scooterలు డిటాచబుల్ బ్యాటరీలు క‌లిగి ఉన్నాయి.  ఈవిట్రిక్‌ సంస్థ ఎల‌క్ట్రిక్ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎల‌క్ట్రిక్‌ బైక్‌ల‌ను మరియు ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలను కూడా సిద్ధం చేస్తోంది.

కొన్ని నెలల క్రితం ఎలక్ట్రిక్ టూవీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్న‌ట్లు EVTRIC ప్ర‌క‌టించింది. తాజ‌గా ఇప్పుడు తన మొదటి రెండు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను ప్రారంభించింది. EVTRIC యాక్సిస్ అలాగే EVTRIC రైడ్, ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు లో స్పీడ్ ప‌రిధిలోకి వ‌స్తాయి. వీటి ఎక్స్ షోరూం ధరలు వ‌రుస‌గా రూ. 64,994, 67,996 గా ప్ర‌క‌టించింది.  ఈ సంస్థ యువత, చిన్న కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని ఈ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ EV లతో పాటు, కంపెనీ త్వ‌ర‌లో ఎల‌క్ట్రిక్‌ సైకిళ్లు, ఎలక్ట్రిక్ స్కూటర్లు, మరియు ఎలక్ట్రిక్ మూడు చక్రాల వాహనాలను కూడా త‌యారు చేస్తోంది.

READ MORE  Free Solar Power | తెలంగాణలో 22 గ్రామాలకు ఉచితంగా సోలార్ కరెంట్..!

తిరుపతి మరియు హైదరాబాద్‌లలో..

EVTRIC యాక్సిస్ నాలుగు రంగులలో అదుబాటులో ఉంది .అవి పాదరసం తెలుపు, పెర్షియన్ ఎరుపు, లెమ‌న్ ఎల్లో, మరియు రాయ‌ల్ యాష్ రంగుల్లో ల‌భ్య‌మ‌వుతుంది. ఇక EVTRIC రైడ్ డీప్ సెరులియన్ నీలం, పర్షియన్ రెడ్, సిల్వ‌ర్‌, నోబెల్ యాష్, మరియు మెర్క్య‌రీ వైట్ రంగులలో లభిస్తుంది. కంపెనీ వెబ్‌సైట్, quickrycart.com, atiyaselectric.com మరియు ewheelers.in లో ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయవచ్చు. మొదటి దశలో, కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఢిల్లీ, గుర్గావ్, పూణే, ఔరంగాబాద్, బెంగళూరు, తిరుపతి మరియు హైదరాబాద్‌లలో పంపిణీ చేస్తుంది.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

రాబోయే ఆరు నెలల్లో దేశంలోని 28 రాష్ట్రాల్లో ఈవీట్రిక్ త‌న‌ డీలర్‌షిప్‌లను ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించింది. ఈ కంపెనీ ఇప్పటికే ఆన్‌బోర్డింగ్ డీలర్లను ప్రారంభించింది. 2021-22 దాని ప్రారంభ విస్తరణ ప్రణాళికలో భాగంగా మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, కేరళ, కర్ణాటక, ఢిల్లీ- NCR, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిషా పశ్చిమ బెంగాల్‌లో ప్రారంభించాల‌ని సంస్థ నిర్ణయించింది.

యాక్స‌స్‌, రైడ్ వాహ‌నాల ఫీచ‌ర్లు ఇవీ..

కాగా ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల‌లో డిటాచ‌బుల్ లిథియం అయాన్ బ్యాటరీ, ఉపయోగిస్తోంది. నార్మ‌ల్ ఛార్జర్‌ని ఉపయోగించి చార్జ్ చేస్తే కేవ‌లం 3.5 గంటల్లోనే ఫుల్ చార్జి అవుతుంద‌ని కంపెనీ చెబుతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 75 కిలోమీటర్ల వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. ఇందులో 250W మోటార్ ను ఉప‌యోగించారు. ఈ రెండు మోడ‌ళ్లు గంట‌లకు 25kmph గరిష్ట వేగాన్ని అందుకుంటుంద‌ని కంపెనీ పేర్కొంది. లోస్పీడ్ లో వెళ్తుంది కాబ‌ట్టి దీనికి ఈ వాహ‌నాలు న‌డిపేవారికి డ్రైవింగ్ లైసెన్స్ అవ‌స‌రం లేదు.
ఇక ఈ రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ల ప్రధాన లక్షణాలలో LED హెడ్‌లైట్లు, 12-అంగుళాల ట్యూబ్‌లెస్ టైర్లు, సైడ్ స్టాండ్ సెన్సార్, రివర్స్ పార్క్ అసిస్ట్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు 190 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండు సంవత్సరాల బ్యాటరీ వారంటీని క‌లిగి ఉన్నాయి.

READ MORE  Warivo EV Scooter | రూ.79,999/- లకే హైస్పీడ్ ఈవీ స్కూటర్.. ఫీచర్లు అదుర్స్..

5 thoughts on “EVTRIC నుంచి రెండు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *