- ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన
- మహిళా ప్రయాణంతో సంస్థ రాబడి పెరుగుదల
హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ సంస్థ ఎండీ నాగిరెడ్డి మంగళవారం భద్రాచలం ఆర్టీసీ డిపోను సందర్శించిన సందర్భంగా పలు కీలక విషయాలను వెల్లడించారు. మూడేళ్లలో హైదరాబాద్ పరిధిలో పూర్తిగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలకు కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకువస్తామని తెలిపారు.
ఎలక్ట్రిక్ బస్సుల లక్ష్యం
ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 800కు పైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మూడేళ్లలో హైదరాబాద్ వ్యాప్తంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండేళ్లలో సంస్థ 2,500 కొత్త బస్సులను కొనుగోలు చేసింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం (మహాలక్ష్మి పథకం) కారణంగా ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రాబడి పెరుగుతోందని నాగిరెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రోజూ పది వేల బస్సుల్లో 60 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో దాదాపు 45 లక్షల మంది మహిళలే ఉంటున్నారు. ఇప్పటివరకు 250 కోట్లకు పైగా మహిళలు ఉచిత ప్రయాణం చేయగా, దీనివల్ల మహిళలకు సుమారు ₹8,500 కోట్లు ఆదా అయిందని ఎండీ నాగిరెడ్డి వివరించారు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..



