Hydro Electric Projects

Hydro Electric Projects | జ‌ల‌విద్యుత్‌పై తెలంగాణ స‌ర్కార్ ఆస‌క్తి

Spread the love

Hydro Electric Projects : బూట్ (BOOT) పద్ధతిలో 22 జ‌ల విద్యుత్ కేంద్రాల (Hydro Electric Projects) ఏర్పాటుకు హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh) ప్రభుత్వం ప్ర‌తిపాద‌న‌ల‌ను ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ (Telangana) ప్ర‌భుత్వం సానుకూలంగా స్పందించింది. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి మ‌ల్లు విక్ర‌మార్క నేతృత్వంలో ఓ బృందం ఈ రోజు (గురువారం) హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ్లింది.

Hydro Electric Projectsపై తెలంగాణ స‌ర్కార్ ఆస‌క్తి

హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌కు వెళ్లిన తెలంగాణ ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క (Deputy Chief Minister Mallu Bhatti Vikramarka), విద్యుత్ శాఖ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాష్ట్ర ముఖ్య‌మంత్రి సుఖ్వింద‌ర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu)తో భేటీ అయ్యారు. 100 మెగావాట్లకు పైగా సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులపై ఆసక్తి క‌న‌బ‌రుస్తున్న‌ట్టు తెలిపారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ విద్యుత్ శాఖ కార్యదర్శితో కూడా చర్చలు జరిపారు. సెలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (400 మెగావాట్లు), మియార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (120 మెగావాట్లు) ప్రాజెక్ట్ స్థలాలను పరిశీలించారు. తెలంగాణ రాష్ట్రం సెలి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (400 మెగావాట్లు), మియార్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ (120 మెగావాట్లు)లపై ఆసక్తిని వ్యక్తం చేస్తూ అధికారికంగా హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రికి లేఖ‌ను సమర్పించారు. ఈ ప్రాజెక్టుల ఏర్పాటుపై త్వ‌ర‌లోనే మౌలిక అవగాహన ఒప్పందం (MoU) జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తోంది.

విద్యుత్ రంగ అభివృద్ధి

ఈ ప్రాజెక్టుల ద్వారా హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉత్పత్తి అయ్యే జలవిద్యుత్‌ను తెలంగాణ రాష్ట్రానికి అందించనున్నారు. తద్వారా ప్రస్తుత, భవిష్యత్తు అవసరాల కోసం ఈ విద్యుత్ సరఫరా బలోపేతం అవుతుంది. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడానికి తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే హిమాచల్ ప్రదేశ్‌లోని జలవిద్యుత్ ప్రాజెక్టులపై ఆసక్తి చూపుతోంద‌ని తెలుస్తోంది.

విద్యుత్ అవ‌స‌రాలు తీర్చ‌నున్న Hydro Electric Projects

హిమాచల్ ప్రదేశ్‌లోని సెలి, మియార్ ప్రాజెక్టులు తెలంగాణలో విద్యుత్ అవసరాలను తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషించ‌నున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు పారిశ్రామిక, గృహ అవసరాలను తీర్చడంలో ప్ర‌ధాన పాత్ర‌ను పోషించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అలాగే పునరుత్పాదక శక్తి లక్ష్యాలను చేరుకోవడంలో ఈ ప్రాజెక్టులు దోహ‌ద‌ప‌డ‌నున్నాయి.


హరితమిత్ర వెబ్ సైట్ పర్యావరణం, సేంద్రియ వ్యవసాయం, గ్రీన్ మొబిలిటీ, సోలార్ ఎనర్జీ (Solar Energy) కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. సరికొత్త వార్తలను కోసం మా గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్(X) , వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు..

More From Author

Battery Electric Vehicle

Battery Electric Vehicle : భ‌విష్య‌త్తంతా ఎల‌క్ట్రిక్ కార్ల‌దే.. ఆటోమొబైల్ రంగంలో విప్ల‌వం

Suzuki eAccess

New Suzuki eAccess : కొత్తగా సుజికీ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పెషాలిటీస్ ఇవే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *