KVK Ghantasala | కె.వి.కె ఘంటసాల ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన యాత్ర

KVK Ghantasala | కె.వి.కె ఘంటసాల ఆధ్వర్యంలో రైతు విజ్ఞాన యాత్ర

KVK Ghantasala Farmer Visit | ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఘంటసాల కృషి విజ్ఞాన కేంద్రం (KVK) రైతు సాధికారత దిశగా రెండు కీలక కార్యక్రమాలను నిర్వహించింది. గురువారం దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర్రు గ్రామాలు, గుంటూరు జిల్లా నుంచి రైతులను విజ్ఞాన యాత్ర కు తీసుకురావడం జరిగినది.

ఈ కార్యక్రమంలో ముందుగా సీనియర్ శాస్త్రవేత్త & అధిపతి డాక్టర్​ డి. సుధారాణి గారు కృషి విజ్ఞాన కేంద్రానికి సంబంధించిన విధుల వివరాలు, పనితీరు, కేంద్రంలో జరుగుతున్న వరి, మినుము విత్తన ఉత్పత్తి గురించి, కృషి విజ్ఞాన కేంద్రంలో జరుగుతున్న శిక్షణా కార్యక్రమాలు, క్షేత్ర స్థాయి పరిశోధనలు, ప్రథమ శ్రేణి ప్రదర్శన క్షేత్రాల వివరాలు తెలియజేశారు.

అనంతరం కృషి విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన డెమో యూనిట్స్ అయిన షేడ్ నెట్​లో మొక్కల పెంపకం, న్యూట్రి గార్డెన్, కోళ్ల పెంపకం, మేకల పెంపకం, పాడి పెంపకం, అజొల్ల పెంపకం, వానపాముల ఎరువు తయారీ, గుర్రపుడెక్క నుంచి ఎరువు తయారీ, భూసార పరీక్ష కేంద్రం, జీవ నియంత్రణ ప్రయోగశాలను సందర్శించారు.

ఈ సందర్శనలో కేవికే శాస్త్రవేత్తలు డాక్టర్​ మంజు వాణి, డాక్టర్​ రేవతి, డా. వెంకట లక్ష్మి, యశ్వంత్ కుమార్, డా. నవీన్, రైతులు, విజయ్ బాబు, ఏడీఏ, తెనాలి, సుదీర్ బాబు, శ్రీనివాస్ రెడ్డి మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

KVK Ghantasala

KVK Ghantasala : పుట్ట‌గొడుగుల పెంప‌కంపై అవ‌గాహ‌న‌

ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని కృషి విజ్ఞాన కేంద్రం, ఘంటసాల వారు శీలంవారిపాలెం గ్రామం లోని పుట్టగొడుగుల పెంపకం యూనిట్ ను సందర్శించారు. కేవికే, సమన్వయకర్త, డా. డి.సుధారాణి గారు వేసవి కాలంలో పుట్టగొడుగుల పెంపకం లో పాటించవలసిన యాజమాన్య పద్దతులను, బ్యాంక్ రుణాలు, పుట్టగొడుగుల పెంపకందారులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల గురించి వివరించారు. కార్యక్రమం లో కే వి కే శాస్త్రవేత్తలు జి. కృష్ణవేణి, డా. ఎం.వెంకటలక్ష్మి, మహిళలు పాల్గొన్నారు.

Harithamithra

👉 “Eco friendly & environmental news updates for Free”

వ్యవసాయం, సోలార్​​ ఎనర్జీ, గ్రీన్​ మొబలిటికి సంబంధించిన అప్‌డేట్స్​ను ఉచితంగా పొందండి!"

We don’t spam! Read our privacy policy for more info.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

🌱 పర్యావరణ వార్తలు వెంటనే తెలుసుకోండి!

Green Mobility, Solar, EV, Environment కి సంబంధించిన తాజా వార్తలు కోసం Harithamitra ను Follow అవ్వండి.

♻️ Harithamitra – పర్యావరణానికి మీ డిజిటల్ మిత్రుడు