- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డిఫైన్డ్ వెహికల్ (AIDV) ప్లాట్‌ఫామ్
- కాలక్రమేణా దానంతట అదే అప్‌గ్రేడ్ అయ్యే మేధో వ్యవస్థ
- వచ్చే 3-4 ఏళ్లలో 5 రకాల కొత్త ఈవీ సెగ్మెంట్లు
- 97 మంజూరైన పేటెంట్లతో 400 కంటే ఎక్కువ ఆవిష్కరణలు
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ MATTER, టెక్నాలజీ డే 3.0 (జనవరి 21, 2026) సందర్భంగా వాహన రంగంలో ఒక చారిత్రక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. కేవలం హార్డ్‌వేర్ లేదా సాఫ్ట్‌వేర్‌పై మాత్రమే ఆధారపడకుండా, కృత్రిమ మేధస్సు (AI) ప్రాతిపదికన పనిచేసే AIDV (AI-Defined Vehicle) ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది.
ఏమిటీ AIDV టెక్నాలజీ?
సాధారణ వాహనాలు ఫ్యాక్టరీ నుండి వచ్చినప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి. కానీ, MATTER రూపొందించిన AIDV ప్లాట్‌ఫామ్ నిరంతరం పరిణామం చెందుతుంది. వాస్తవ ప్రపంచ పరిస్థితులు, డ్రైవింగ్ శైలిని బట్టి వాహనం తన శక్తిని, విద్యుత్ సరఫరాను, నియంత్రణ వ్యవస్థలను సర్దుబాటు చేసుకుంటుంది.
సాఫ్ట్‌వేర్ కంటే మిన్న: సాఫ్ట్‌వేర్-నిర్వచించిన వాహనాలు కేవలం అప్‌డేట్లపై ఆధారపడితే, AIDV వాహనం తన జీవితచక్రం అంతటా మేధస్సుతో స్వీయ మెరుగుదలలు చేసుకుంటుంది.
MATTER ఇప్పటికే తన AERA మోటార్‌సైకిల్‌లో ఈ టెక్నాలజీ మూలాలను ప్రవేశపెట్టింది. ఇందులో:
లిక్విడ్-కూల్డ్ మోటార్ & బ్యాటరీ వేడిని నియంత్రించి పనితీరును పెంచుతుంది. హైపర్‌షిఫ్ట్ గేర్‌బాక్స్.. ఎలక్ట్రిక్ వాహనాల్లో గేర్ల అనుభూతిని అందిస్తుంది. ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్స్ హార్డ్‌వేర్ మార్చకుండానే కొత్త ఫీచర్లను జోడించుకోవచ్చు.
రాబోయే 4 ఏళ్లలో 5 కొత్త వాహనాలు (Electric Vehicle)
ఒకే ఒక AIDV ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి రాబోయే 36 నుండి 48 నెలల్లో 5 వేర్వేరు విభాగాల్లో వాహనాలను విడుదల చేయాలని MATTER లక్ష్యంగా పెట్టుకుంది.
- నేకెడ్ స్ట్రీట్ మోటార్‌సైకిళ్లు
- స్ట్రీట్ ఫైటర్ మోడల్స్
- అడ్వెంచర్ బైక్స్
- కమ్యూటర్ మోటార్‌సైకిళ్లు
- ఎలక్ట్రిక్ స్కూటర్లు
పేటెంట్ల పరంపర
టెక్నాలజీ పరంగా తిరుగులేకుండా ఉండేందుకు MATTER ఇప్పటివరకు 400 కంటే ఎక్కువ ఆవిష్కరణలు చేసింది. ఇందులో 97 పేటెంట్లు ఇప్పటికే మంజూరయ్యాయి. భారతదేశ ద్విచక్ర వాహన మార్కెట్‌ను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని కంపెనీ తెలిపింది.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు X , వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..





