Thursday, November 21Lend a hand to save the Planet
Shadow

microplastics : ప్రతీ వ్యక్తి ఏడాదికి రెండు పాలిథిన్ సంచులను మింగుతున్నారు.. మైక్రో ప్లాస్టిక్ తో పెను ప్రమాదం.. ముఖ్యంగా..

Spread the love

మైక్రో ప్లాస్టిక్ తో వంధ్యత్వం వచ్చే ప్రమాదం

microplastics : నిత్య జీవితంలో మనం ప్లాస్టిక్ వస్తువులు లేని రోజును మనం ఊహించుకోలేం.. దాదాపు చాలా సందర్భాల్లో ప్లాస్టిక్ వస్తువులు, కవర్లను వాడుతున్నారు. అయితే తాజాగా ఓ అధ్యయం ద్వారా ప్లాస్టిక్ కు సంబంధించి మరో చేదు నిజం వెలుగులోకి వచ్చింది. మైక్రో ప్లాస్టిక్ వల్ల పుట్టిన బిడ్డలు వంధ్యత్వానికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయం ఆహారంలో ఉండే మైక్రోప్లాస్టిక్‌ పై పరిశోధనలు చేసింది. ఆహారంలో మైక్రో ప్లాస్టిక్ ను గుర్తించడానికి ప్లాస్టిక్ ప్యాకింగ్‌లో చుట్టిన ఆహారంతోపాటు ప్లాస్టిక్ కవర్లలో నిల్వ చేయని ఆహారపదార్థాలను సేకరించి పరిశోధించింది.
అయితే ఈ అధ్యయనంలో ప్లాస్టిక్ ప్యాకింగ్ వస్తువులలో దాదాపు 2.30లక్షల మైక్రోప్లాస్టిక్‌లను కనుగొనగా, రెండవ ప్యాకింగ్‌లో 50,000 మైక్రోప్లాస్టిక్ కణాలు ఉన్నాయి. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. ప్రతీవ్యక్తి ప్రతిరోజూ 10 గ్రాముల మైక్రోప్లాస్టిక్‌ను మింగుతున్నాడు.
ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) చేసిన పరిశోధనల ప్రకారం, గర్భిణి స్త్రీలు ప్లాస్టిక్ కంటైనర్‌లలో నిల్వ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ప్రమాదానికి గురవుతారు. మైక్రోప్లాస్టిక్ కణాలు సంతానోత్పత్తిని దెబ్బతీస్తాయి.

మైక్రోప్లాస్టిక్ అంటే ఏమిటి?

అత్యంత సూక్ష్మమైన ప్లాస్టిక్ కణాలను మైక్రోప్లాస్టిక్ అంటారు. సగటున, ప్రతీ వారం 0.1 నుంచి 5 గ్రాముల మైక్రోప్లాస్టిక్ కణాలు వివిధ మార్గాల్లో మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది. సగటు వ్యక్తి ప్రతి సంవత్సరం 11,845 నుంచి 1,93,200 మైక్రోప్లాస్టిక్ కణాలను మింగేస్తాడు. అంటే 7 గ్రాముల నుంచి 287 గ్రాముల వరకు.. ఇది అతని/ఆమె జీవితంలో ప్లాస్టిక్ ఉనికిపై ఆధారపడి ఉంటుంది.

న్యూస్ అప్ డేట్స్ కోసం మన వాట్సప్ చానల్ లో చేరండి

microplastics తో వచ్చే అనారోగ్యం ఏమిటి?

ఆహార పదార్థాలు, లేదా ద్రవాల నిల్వ కోసం ప్లాస్టిక్ కంటైనర్లను సాధారణంగా పాలికార్బోనేట్ ప్లాస్టిక్ నుంచి తయారు చేస్తారు. ఈ ప్లాస్టిక్‌ను అనువైనదిగా చేయడానికి, బిస్ఫినాల్ A (BPA) దీనికి కలుపుతారు. ఇది పారిశ్రామిక రసాయనం. ఢిల్లీలోని ICMR, హైదరాబాద్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) పరిశోధకులు గర్భధారణ సమయంలో BPA రసాయనాలు మగ శిశువులో సంతానోత్పత్తి వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని కనుగొన్నారు.
ఎలుకలపై ఈ పరిశోధన జరిగింది. దీని కోసం, కడుపుతో ఉన్న ఎలుకలను రెండు గ్రూపులుగా విభజించారు. ఒక సమూహం గర్భధారణ సమయంలో నాలుగు నుంచి 21 రోజుల పాటు BPA రసాయనాలకు గురవుతుంది. మరొక సమూహం దాని నుంచి దూరంగా ఉంచబడింది. BPA సమీపంలో నివసించే ఎలుకలలో కొవ్వు ఆమ్లాలు పేరుకుపోవడం ప్రారంభించాయి. ఈ కొవ్వు ఆమ్లం స్పెర్మ్ పెరుగుదలకు అవసరమైన పొర దెబ్బతింటుందని గుర్తించారు.
BPA రసాయనం హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అంతేకాకుండా క్యాన్సర్, వంధ్యత్వానికి కారణమవుతుంది. కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వల్ల అనారోగ్య సమస్యలు పుట్టకముందు నుంచే ప్రభావం చూపుతున్నాయి.

గర్భిణులు ప్లాస్టిక్ కు దూరంగా ఉండాలి

NIN యొక్క పరిశోధన ప్రకారం.. ప్రతిఒక్కరూ, ముఖ్యంగా గర్భిణి స్త్రీలు, ప్లాస్టిక్ కంటైనర్లను ఉపయోగించకుండా ఉండాలి. అటువంటి కంటైనర్లలో ముఖ్యంగా వేడి పదార్థాలను లేదా మైక్రోవేవ్ లో ఎక్కువసేపు నిల్వ ఉంచడం వల్ల BPA రసాయనాలు ప్లాస్టిక్ నుంచి ఆహారంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.

మైక్రోప్లాస్టిక్స్ ఎక్కడ ఉన్నాయి?

నీటిలో మైక్రోప్లాస్టిక్స్ : microplastics లు సాధారణంగా పంపు నీటిలో,  ప్లాస్టిక్‌లో నిల్వ చేయబడిన నీటిలో కనిపిస్తాయి. వాతావరణంలో ఉన్న ప్లాస్టిక్ వ్యర్థాలు విచ్ఛిన్నమై మట్టిలో, భూగర్భంలో, సముద్రాలు,  నదులలో కలిసిపోతున్నాయి.
బట్టలు,  బొమ్మలలో : బ్రిటన్‌లోని పోర్ట్స్‌మౌత్ యూనివర్సిటీ అధ్యయనం ప్రకారం, బొమ్మలు మరియు బట్టల నుండి ప్రతిరోజూ 7000 మైక్రోప్లాస్టిక్ కణాలు మన శరీరంలోకి పీల్చబడుతున్నాయి.

మైక్రోప్లాస్టిక్‌లను ఎలా తగ్గించాలి

  • వండిన ఆహారాన్ని ప్లాస్టిక్ డబ్బాల్లో ఉంచవద్దు.
  • మైక్రోవేవ్ ప్లాస్టిక్‌ను నివారించండి..
  • వాటర్ కోసం ప్లాస్టిక్‌ బాటిళ్లకు కు బదులుగా గాజు, స్టీల్ లేదా రాగి సీసాలను ఉపయోగించండి.
  • మీ ఇంటి చెత్తలో ప్లాస్టిక్‌ని వేయకండి. దానిని రీసైక్లింగ్ సంస్థలకు ఇవ్వకండి లేదా ప్లాస్టిక్ వ్యర్థాలను విడిగా వేయకండి.
  • చెత్తలో ప్లాస్టిక్‌ కలిస్తే రీసైకిల్‌ చేయడం కష్టమవుతుంది.
  • ప్రభుత్వ డేటా ప్రకారం, భారతదేశం ప్రతి సంవత్సరం 3.5 మిలియన్ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేస్తుంది, అయితే ప్లాస్టిక్‌ను రీసైకిల్ చేసే మన సామర్థ్యం అందులో సగం మాత్రమే.

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *