Harithamithra Telugu News

Home Agricultue సేంద్రియ వ్యవసాయం Organic Farming | సేంద్రియ సాగులో ఆద‌ర్శం.. సొంత బ్రాండ్‌తో మార్కెట్‌లోకి !

Organic Farming | సేంద్రియ సాగులో ఆద‌ర్శం.. సొంత బ్రాండ్‌తో మార్కెట్‌లోకి !

1
Organic Farming

Nagarkurnool | నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం కార్వంగ గ్రామానికి చెందిన రైతు దంపతులు కొసిరెడ్డి లావణ్య – రమణ రెడ్డి సంప్రదాయ వ్యవసాయానికి భిన్నంగా ప్రకృతి సేద్యం (Organic Farming )తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా మిర్చి పంటకు వారంలో పలుమార్లు రసాయన పిచికారీ అవసరం అవుతుంది. కానీ ఈ దంపతులు ఒక్క కూడా రసాయన ఎరువులు ఉపయోగించకుండా వీరముష్టి కషాయం, అగ్ని అస్త్రం, గోమూత్రం, పశువుల ఎరువు వంటి స్వచ్ఛమైన ప్రకృతి ఆధారిత పద్ధతులతో పంటను సంరక్షించుకుంటున్నారు. ఫలితంగా, వీరి మిర్చిపంట ఎలాంటి తెగుళ్లు లేకుండా ఆరోగ్యకరంగా పెరిగి ఎకరాకు 20 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తోంది.

అంతేకాక, వరి పంటలో కూడా సాధారణ రకాల కంటే అధిక పోషక గుణాలు క‌లిగిన‌ బాస్మతి, బ్లాక్ రైస్ వంటి ప్రత్యేక రకాలను సైతం పండిస్తున్నారు. పంటను నేరుగా వినియోగదారులకు అందించడానికి ‘లావణ్య బ్రాండ్’, ‘ప్రకృతి సేద్యం’ పేర్లతో హైదరాబాద్‌తోపాటు ఇతర జిల్లాలకు సరఫరా చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని స్వంత ఆర్గానిక్ స్టోర్ ఏర్పాటు చేసి, తమ సేంద్రీయ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ప్రకృతి సాగుకు, నాణ్యమైన ఆర్గానిక్ ఆహారానికి నిదర్శనంగా నిలిచిన ఈ రైతు దంపతులు సుస్థిర వ్యవసాయం ఎలా ఉండాలో చూపిస్తున్నారు.


Previous articleAgriculture subsidy | కూరగాయలు సాగు చేసే రైతుల‌కు స‌ర్కారు గుడ్‌న్యూస్‌
Next articleSolar Project | నంద్యాలలో 1200 MWh BESS & 50 MW హైబ్రిడ్ సోలార్ ప్రాజెక్ట్‌లు
Kiran Podishetty
కిరణ్ పొడిశెట్టి, హరితమిత్ర మీడియా వ్యవస్థాపకులు, పర్యావరణ పరిరక్షణకు అంకితభావంతో పనిచేస్తున్న సీనియ‌ర్‌ జర్నలిస్ట్. ఎమ్మెస్సీ, ఎంజీజే పూర్తిచేసిన‌ ఆయనకు ప్రింట్ మీడియా రంగంలో 17 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికల్లో సబ్‌ ఎడిటర్‌గా ప‌నిచేశారు. హరితమిత్ర ద్వారా ఆయన సేంద్రియ వ్యవసాయం, సోలార్ ఎనర్జీ, గ్రీన్ మొబిలిటీ (ఎలక్ట్రిక్‌, సిఎన్‌జి వాహనాలు) ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ వంటి అంశాలపై నిరంతరం విశ్లేషణాత్మక కథనాలు, తాజా అప్‌డేట్స్‌ను అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here