National Hydrogen Mission : రోజురోజుకు పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతండడంతో భారత ఆటోమొబైల్ రంగం విద్యుదీకరణ దిశగా సాగనుంది. ఈమేరకు 2030 నాటికి, ఎలక్ట్రిక్ వాహనాలు (EV లు) భారతదేశంలో మొత్తం కొత్త వాహన విక్రయాల్లో సుమారు 30% ఉంటాయని అంచనా. ఇందులో సింహభాగం.. ద్విచక్ర వాహనాలే దేశాన్ని విద్యుదీకరణ వైపు నడిపించనున్నాయి. ఈ విభాగంలో EV లు దశాబ్దం చివరి నాటికి మొత్తం అమ్మకాల్లో సుమారు దాదాపు 50% ఉంటాయని గణాంకాలు చెబుతున్నాయి. కమర్షియల్ ట్రాన్స్‌పోర్టేషన్, అంటే లైట్, హెవీ డ్యూటీ ట్రక్కులు అలాగే బస్సులు కూడా విద్యుదీకరణ వైపు అడుగులు వేయనున్నాయి.
National Hydrogen Mission
హైడ్రోజన్-ఆధారిత ఫ్యూయల్ సెల్ కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలు కర్బన ఉద్గారాలు వెలువరించవు. ఇవి జీరో ఎమిషన్ వాహనాలు లిథియం-అయాన్ లేదా ఇతర రకాల బ్యాటరీ-ఆధారిత ఎలక్ట్రిక్ వాహనాల కంటే హైడ్రోజన్ ఇంధనం కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలతో అనేక ప్రయోజనాలు ఉన్నాయి. హైడ్రోజన్ అధిక శక్తి సాంద్రతను కలిగి ఉంంటుంది. అంటే తక్కువ బరువుతో ఎక్కువ ఇంధనాన్ని వాహనం ద్వారా తీసుకెళ్లవచ్చు. ఫలితంగా ఒకే ఇంధనం నింపడం ద్వారా వాహనం ప్రయాణించే దూరం పెరుగుతుంది.
భారతదేశాన్ని ప్రపంచ గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా మార్చే లక్ష్యంతో ప్రభుత్వం జాతీయ హైడ్రోజన్ మిషన్ (NHM) ను ప్రారంభించింది. మే 2021లో, FAME పథకం పరిధిలో హైడ్రోజన్ EVలు, హైడ్రోజన్ ఫిల్లింగ్ ఫెసిలిటీలను చేర్చాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబరులో ప్రభుత్వం ఆటోరంగం కోసం ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఇంధన ఆధారిత వాహనాలను ప్రోత్సహించేందుకు 2030 డాలర్ల పథకాన్ని ప్రతిపాదించింది.
రూ.800 కోట్ల బడ్జెట్
NHM FY22 కోసం రూ.800 కోట్ల బడ్జెట్ ఉంది. మొదటి ఏడాది NHM ప్రధానంగా పైలట్ ప్రాజెక్టుల నిధులపై అలాగే హైడ్రోజన్ రంగంలో ప్రయోగాత్మక కార్యక్రమాలపై దృష్టి పెడుతుంది. ఇండియన్ ఆయిల్, ఎన్‌టిపిసి వంటి భారతీయ పీఎస్‌యులు భారతీయ రోడ్లపై ఇంధన సెల్ బస్సులను తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నాయి.
ఇండియన్ ఆయిల్ ఇప్పటికే బిడ్లను ఆహ్వానించింది. టాటా గ్రూప్ నుంచి 15 ఇంధన సెల్ బస్సులను కొనుగోలు చేయడానికి టెండర్ ఇచ్చింది. ఇది 2021 చివరి నాటికి ప్రారంభించబడుతుంది. యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై న్యూఢిల్లీ – ఆగ్రా మధ్య తిరుగుతుంది.
అదే సమయంలో ఎన్‌టిపిసి కూడా అలాంటిదే ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. న్యూఢిల్లీ, లేహ్ మధ్య ఇంధన సెల్ బస్సు సర్వీస్, అహ్మదాబాద్- స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మధ్య గుజరాత్‌లో మరొక ఇంధన సెల్ బస్సు మార్గం గుర్తించబడింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ మార్గాలను ప్రయోగాత్మకంగా అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులకు NHM, PSU ల ద్వారా పాక్షికంగా నిధులు సమకూరుతాయి.
భారతదేశంలో EV తయారీకి ఊపు
FAME India, NHM, PLI, మొదలైన ప్రభుత్వ పథకాలను కలిపి భారతదేశంలో EV తయారీకి ఊపునిస్తుంది. ఈవీ రంగంలో విదేశీ పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వివిధ కంపెనీలు ప్రకటించిన నెట్ జీరో ఉద్గారాల అంతిమ లక్ష్యం.. వాటి సరఫరా గొలుసులను ఉద్గార రహితంగా చేయడం. పరిశుభ్రమైన రవాణాను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న కార్యక్రమాలు భారతదేశానికి కార్బన్ ఎమిషన్‌ను తగ్గించటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్వచ్ఛమైన ఆటోమొబైల్స్ తయారీకి కేంద్రంగా కూడా ఉపయోగపడతాయి.
👌👌👌👌👌👌