Thursday, August 21Lend a hand to save the Planet
Shadow

Okaya Faast F2F e-scooter launched

Spread the love

ప్ర‌ముఖ ఎలక్ట్రిక్ వాహ‌నాల త‌యారీ సంస్థ ఒకాయ (Okaya) తాజాగా Faast F2F పేరుతో ఓ స‌రికొత్త e-scooter లాంచ్ చేసింది. ఇది ఒక్క‌సారి చార్జ్ చేస్తే సుమారు 70 నుంచి 80కి.మి. వ‌ర‌కు ప్ర‌యాణిస్తుంది. గంట‌కు 55కిలోమీట‌ర్ల వేగంతో వెళ్తుంది. ఇక దీని ధ‌ర Rs. 83,999. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నలుపు, నీలం, ఆకుపచ్చ, బూడిద, సిల్వ‌ర్, తెలుపు వంటి ఆరు రంగుల్లో అందుబాటులో ఉంది.

2 సంవత్సరాల వారంటీ

Okaya Faast F2F e-scooter .. 800W-BLDC-హబ్ మోటార్‌ను క‌లిగి ఉంది. 2.2 kWh లిథియం అయాన్ బ్యాట‌రీని అమ‌ర్చారు. బ్యాటరీ, మోటారుపై 2 సంవత్సరాల వారంటీని ఇస్తున్నారు. Faast F2F స్కూట‌ర్ పూర్తిగా ఛార్జ్ కావడానికి 4-5 గంటలు పడుతుందని కంపెనీ పేర్కొంది. ఈ స్కూట‌ర్‌ను మూడు డ్రైవింగ్ మోడ్‌లు. ఎకో, సిటీ, స్పోర్ట్స్ మోడ్‌ల‌తో న‌డ‌ప‌వ‌చ్చు.

ఇత‌ర ఫీచ‌ర్ల విష‌యానికొస్తే ఇందులో 10అంగుళాల వీల్స్‌ను అమ‌ర్చారు. Okaya Faast F2F టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, రియర్ షాక్ అబ్జార్బర్స్, రిమోట్ కీ, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను చూడ‌వ‌చ్చు.

ఒకాయ ఎలక్ట్రిక్ వెహికల్స్ మేనేజింగ్ డైరెక్టర్ అన్షుల్ గుప్తా మాట్లాడుతూ, “ఒకాయ ఫాస్ట్ ఎఫ్ 2ఎఫ్ ప్రారంభించడంతో తాము భారతదేశంలోని అత్యుత్తమ విశ్వసనీయమైన EVల కోసం కొత్త ప్రమాణాలను అనేక స్థాయిలకు పెంచాము. సౌకర్యవంతమైన స్టైలిష్ Okaya Faast F2F అంద‌రికీ అనుకూలంగా ఉంటుంద‌ని తెలిపారు. సరసమైన ధరలో ఎలక్ట్రిక్ మొబిలిటీకి మారాలని చూస్తున్న ప్రజలకు ఇది సరైన ఎంపికగా నిలుస్తుందని తాము విశ్వసిస్తున్న‌ట్లు తెలిపారు.


tech news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Kinetic DX : బుక్ చేసుకునే ముందు తెలుసుకోవలసిన హైలెట్ ఫీచర్లు River Indie : రివర్ ఇండీ స్కూటర్ సేల్స్ జోరు