Ola Electric offer | గుడ్ న్యూస్.. ఓలా స్కూటర్ పై రూ. 25,000 వరకు భారీ డిస్కౌంట్లు

Spread the love

S1 ప్రో,  S1 ఎయిర్ కొనుగోలుపై ఎక్స్ టెండెడ్ వారంటీపై 50% తగ్గింపు

Ola Electric offer | బెంగళూరు :  75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఓలా ఎలక్ట్రిక్ ఈ రోజు ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ పేరుతో భారీ కమ్యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా, ఓలా కమ్యూనిటీకి చెందిన వందలాది మంది సభ్యులు భారతదేశ వారసత్వం, సంస్కృతిని ప్రోత్సహించడానికి గ్రీన్ మొబిలిటీ స్ఫూర్తి, దేశభక్తి ఉత్సాహంతో దేశంలోని 26 నగరాల్లోని వారి సమీప పర్యాటక వారసత్వ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు.

ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాహనదారులు EVకి మారడానికి ..భారతదేశ EV విప్లవంలో చేరడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. Ola Electric తన స్కూటర్ లైనప్‌పై రూ. 25,000 వరకు విలువైన ఆఫర్‌లను అందించింది. ఈ Ola Electric offer జనవరి 31 వరకు చెల్లుబాటులో ఉంటుంది, కస్టమర్‌లు  ఎక్స్ టెండెండ్ వారంటీపై భారీ 50% తగ్గింపు ఇస్తోంది. అలాగే ఓలా S1 ప్రో మరియు S1 ఎయిర్ మోడల్‌లపై రూ. 2,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. కొనుగోలుదారులు ఎంచుకున్న క్రెడిట్ కార్డ్ EMIలపై INR 5,000 వరకు తగ్గింపులను కూడా పొందవచ్చు, అయితే ఇతర ఫైనాన్స్ ఆఫర్‌లలో జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 7.99% తక్కువ వడ్డీ రేట్లు వంటి ఇతర డీల్‌లు ఉంటాయి. అదనంగా, S1 X+ ఫ్లాట్ రూ. 20,000 తగ్గింపుతో కేవలం INR 89,999 లకే అందుబాటులో ఉంది.

విస్తరణ దిశగా ఓలా

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల తన స్కూటర్ పోర్ట్‌ఫోలియోను ఐదు ఉత్పత్తులకు విస్తరించింది. ఫ్లాగ్‌షిప్ మోడల్ S1 Pro (2 జనరేషన్ ) ధర INR 1,47,499, అయితే S1 Air రూ. 1,19,999 లకు అందుబాటులో ఉంది. ఇది అదనంగా S1X ని మూడు వేరియంట్‌లలో పరిచయం చేసింది.

E-Luna : ఎలక్ట్రిక్ లూనా వస్తోంది.. రూ.500లకే బుకింగ్స్ ప్రారంభం.. వచ్చే నెలలోనే

అవి  S1 X+, S1 X (3kWh),  S1 X (2kWh). విభిన్న ప్రాధాన్యతలతో రైడర్‌ల అవసరాలను తీర్చడానికి. S1 X (3kWh) మరియు S1 X (2kWh) కోసం రిజర్వేషన్ విండో ఓపెన్ చేసింది. వీటిని రూ. 999 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. వీటి ఎక్స్ షోరూం ధరలు వరుసగా INR 99,999 మరియు INR 89,999 ప్రారంభ ధరలో అందుబాటులో ఉంటాయి.


ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కొత్త బజాన్ చేతక్ స్కూటర్.. తక్కువ ధరలోనే.. ఎక్కువ మైలేజీ కొత్తగా వచ్చిన ఎలక్ట్రిక్ లూనా గురించి మీరు తెలుసుకోవలసినవి.. భారత్ లో టాప్ 5 బడ్జెట్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే.. ఇండియాలో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇవే..