
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై మిశ్రమ స్పందన ఎందుకు? అధిక ధర ప్రభావమా?
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, జపాన్‌కు చెందిన ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ Suzuki Motor Corporation తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ e-Access (Suzuki e-Access Electric Scooter) తో మార్కెట్లోకి అడుగుపెట్టింది. అయితే, ప్రారంభ అమ్మకాలు కంపెనీ ఆశించిన స్థాయిలో లేకపోవడం ఇక్కడ గమనించాలి..
అమ్మకాలు ఎందుకు తక్కువగా ఉన్నాయి?
Society of Indian Automobile Manufacturers (SIAM) గణాంకాల ప్రకారం: జనవరి 2026లో మొత్తం 703 యూనిట్లు హోల్‌సేల్ పంపిణీ జరిగింది. అందులో 201 యూనిట్లు మాత్రమే కస్టమర్లకు డెలివరీ చేశారు.
మొత్తం 1.23 లక్షల ఈ-టూ-వీలర్ల అమ్మకాలలో కేవలం 0.16% మార్కెట్ షేర్‌ను సాధించగలిగింది. ఫిబ్రవరి 1–14 మధ్య మరో 169 యూనిట్లు డెలివరీ చేసింది. ఈ గణాంకాలు మార్కెట్లో స్కూటర్‌కు మొదటి దశలో మిశ్రమ స్పందన మాత్రమే లభించిందని సూచిస్తున్నాయి.
Suzuki e-Access Electric Scooter Specifications
| ఫీచర్ | వివరాలు |
| బ్యాటరీ | 3 kWh LFP (Lithium Iron Phosphate) |
| క్లెయిమ్డ్ రేంజ్ | 95 కి.మీ (IDC) |
| టాప్ స్పీడ్ | 70 కి.మీ/గం |
| ధర | ₹1.88 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) |
| వారంటీ | 7 సంవత్సరాలు లేదా 80,000 కి.మీ |
| బైబ్యాక్ హామీ | 3 సంవత్సరాల తర్వాత 60% వరకు |
అధిక ధరే ప్రధాన కారణమా?
₹1.88 లక్షల ధరతో, ఈ స్కూటర్ మార్కెట్లో ఇప్పటికే ప్రజాదరణ పొందిన TVS iQube, Bajaj Chetak వంటి మోడళ్ల కంటే సుజుకీ ఈ ఆక్సెస్ ఈవీకి ఎక్కువ ధర ఉంది. ఇదే కొనుగోలుదారులను వెనక్కి తగ్గించే ప్రధాన కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు.
LFP బ్యాటరీ – దీర్ఘకాలిక ప్రయోజనం ఉంటుంది. ఈ స్కూటర్‌లో ఉపయోగించిన LFP బ్యాటరీ సాధారణ NMC బ్యాటరీలతో పోలిస్తే ఎక్కువ సేవా జీవితం, మెరుగైన భద్రత, తక్కువ నిర్వహణ ఖర్చు
అందిస్తుంది అని కంపెనీ తెలిపింది. అదనంగా, వాటర్ రిసిస్టెంట్, వైబ్రేషన్, ఉష్ణోగ్రత పరీక్షలు వంటి అంతర్జాతీయ ప్రమాణాల పరీక్షలను పూర్తి చేసినట్లు వెల్లడించింది.
7 ఏళ్ల వారంటీ.. నో టెన్షన్!
ఈవీ కొనుగోలుదారుల్లో ప్రధానంగా ఉండే ఆందోళన. బ్యాటరీ లైఫ్. దీనిని దృష్టిలో ఉంచుకుని సుజుకీ ఏకంగా 7 ఏళ్ల వరకు (లేదా 80,000 కి.మీ) పొడిగించిన వారంటీని ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అందిస్తోంది. ఇది భారత ఈవీ రంగంలోనే అత్యుత్తమ వారంటీలలో ఒకటిగా నిలుస్తోంది.
ఏమిటీ 60% బైబ్యాక్ గ్యారెంటీ?
Suzuki e-Access Electric Scooter కొన్న మూడు సంవత్సరాల తర్వాత, ఒకవేళ మీరు దానిని అమ్మాలనుకుంటే.. సుజుకి సంస్థే 60% ధరకు తిరిగి కొనుగోలు చేస్తామని హామీ ఇస్తోంది. అంటే మీరు పెట్టిన పెట్టుబడికి రక్షణ ఉంటుందని కంపెనీ భరోసా ఇస్తోంది.
LFP బ్యాటరీ టెక్నాలజీ
సాధారణంగా ఈవీలలో వాడే NMC బ్యాటరీల కంటే LFP (Lithium Iron Phosphate) బ్యాటరీలకు జీవితకాలం ఎక్కువ. ఇవి వేడిని తట్టుకోగలవు, భారత్‌లోని వాతావరణ పరిస్థితులకు బాగా సెట్ అవుతాయి. అందుకే సుజుకి తన తొలి స్కూటర్‌లో ఈ సురక్షితమైన బ్యాటరీని అమర్చింది.
మార్కెట్ పోటీ & ధర విశ్లేషణ
సుజుకి ఈ-యాక్సెస్ ధర ₹1.88 లక్షలు ఉండటంతో, ఇది టీవీఎస్ ఐక్యూబ్ (TVS iQube), బజాజ్ చేతక్ (Bajaj Chetak) కంటే ఖరీదైనదిగా అనిపిస్తోంది. అయితే, సుజుకి అందించే బ్రాండ్ వాల్యూ, మెయింటెనెన్స్ లేని LFP బ్యాటరీ, సుదీర్ఘ వారంటీ దీనిని ప్రీమియం కస్టమర్లకు దగ్గర చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈవీలు పర్యావరణానికి ఇది ఎలా ఉపయోగకరం?
- ఎలక్ట్రిక్ స్కూటర్లు:
- గాలి కాలుష్యాన్ని తగ్గిస్తాయి
- కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తాయి
- ఇంధనంపై ఆధారాన్ని తగ్గిస్తాయి
- ఈ కారణంగా భవిష్యత్తులో నగర రవాణాలో కీలక పాత్ర పోషించనున్నాయి.
మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.
Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. న్యూస్ అప్డేట్స్ కోసం X , ఫేస్బుక్ పేజీ, వాట్సప్ చానల్ లో జాయిన్ కండి..

